హైదరాబాద్, నవసంబర్ 21:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ స్టార్ బ్యూరో)కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి అసెంబ్లీ 0-15ఎన్నికల్లో మొదటి ఓటును ఇంట్లోనే 95ఏళ్ల వృద్ధురాలు సద్వినియోగం చేసుకుంది. వృద్ధులకు ఇంట్లోనే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఎన్నికల కమిషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఎల్లారెడ్డి పట్టణంలోని బాలాగౌడ్ ఫంక్షన్ హాల్ కాలానికి చెందిన సిద్ధుల మల్లమ్మ (95)ఇంటికి ఎన్నికల సిబ్బంది వెళ్లి ఓటును వేయించారు. ఈ ఓటు నిబంధనల మేరకు ఆమె కొడుకు సిద్ధుల శ్రీరామ్ సమక్షంలో వేయించారు.
V.Rajendernath
ఎల్లారెడ్డి బీజేపీ విజయ సంకల్ప సభకు తూతూ మంత్రంగా హాజరైన జనం. సభ నిర్వహణ నిధులు ఏమయ్యాయి…?
హైదరాబాద్, నవంబర్ 20:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ స్టేట్ బ్యూరో)కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో సోమవారం నిర్వహించిన బీజేపీ విజయ సంకల్ప యాత్రకు జనం తక్కువ సంఖ్యలో వచ్చారు. ఈ సభకు కేంద్ర జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కారీ హాజరయ్యారు. ఈ సభ ఉన్నట్లు కూడా పెద్దగా ప్రచారం, లేకపోవడం, పార్టీ కార్యకర్తలను, ప్రజలను రప్పించి ఎలాంటి సౌకర్యాలు లేకపోవడం కూడా జనం తక్కువ సంఖ్యలో రావడానికి కారణం అన్న వాదనలు వినిపించాయి. ఈ సభకు కేటాయించిన నిధులు తూతూ మంత్రంగానే ఖర్చు పెట్టారన్న ఆరోపణలు వచ్చాయి. ఈ కార్యక్రమ తీరుపై కొందరు బీజేపీ పార్టీ బడా నేతలు, సీనియర్ కార్యకర్తలు సైతం నారాజ్ లో ఉండి పట్టించుకోలేదని సమాచారం. 5వేలకు పైగా ఈ విజయ సంకల్ప యాత్రకు జనం, పార్టీ కార్యకర్తలు హాజరవుతారని అంచనాలు ఉన్న 1500మంది లోపే జనం హాజరు కావడం గమనార్హం. బీజేపీ లో ఉన్న గ్రూప్ రాజకీయాల వల్ల ఇప్పటికే చాలా మంది బీజేపీ నేతలు, కార్యకర్తలు బీజేపీని వీడటం గమనార్హం. మరి కొందరు కూడా బీజేపీని వీడేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఎల్లారెడ్డి బీజేపీ అభ్యర్థి వడ్డేపల్లి సుభాష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ టికెట్ రాలేదని అలిగి బీజేపీలో చేరి ఢిల్లీ నుండి బీజేపీ టికెట్ అయితే తెచ్చుకున్నారు. కానీ ఆయనకు పార్టీలో ఎవరు ఏమిటి అన్న పూర్తి అవగాహన లేకపోవడం వల్ల ఆయన కొంత ఇబ్బంది పడాల్సి వస్తుందని పార్టీ సీనియర్లు కొందరు భావిస్తున్నారు. పార్టీలో ఓ నేత అన్ని తానై చేస్తున్న ఒంటెద్దు పోకడ పార్టీకి నష్టం కలిగిస్తుందని కొందరు పార్టీని నేతలే బహిరంగంగానే అంటున్నారు. బీజేపీ అభ్యర్థి సుభాష్ రెడ్డి మాత్రం 5ఏళ్ళు కోట్లు ఖర్చు పెట్టి ఎల్లారెడ్డి సెగ్మెంట్ ప్రజలకు సేవలు చేసాను, ప్రజలు ఆదరిస్తారన్న నమ్మకంతో ఆయన గెలుపు సాధించాలని ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఆయనకు సరైన గైడెన్స్ లేక తీసుకునే నిర్ణయాలు పార్టీకి నష్టం అని పార్టీలోని వర్గాలు అంటున్నారు. మొట్టమొదటిసారిగా కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వస్తున్నారంటే, బీజేపీ కార్యకర్తలు భారీ సంఖ్యలో ఉంటారని జరిగిన రాజకీయ పరిశీలకులు అంచనాలు తరు మరయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో అభ్యర్థి ప్రచారానికి ఇంకా వారం రోజుల వ్యవధి మాత్రమే ఉంది. బీజేపీ అభ్యర్థి ఎలాగైనా ప్రజల ఆదరణ పొందాలని సినీనటుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బండి సంజయ్, ఈటెల రాజేందర్ తో మూడు సభలు ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. మరి ఆ సభలకైనా జనం హాజరు శాతం ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే.
తెలంగాణ రాష్ట్రంలో అసంఘటిత శ్రమజీవులకు కరువైన బతుకు-సామాజిక భద్రతనిజామాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి మొహమ్మద్ అలీ షబ్బీర్
నిజామాబాద్, నవంబర్ 20:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ బ్యూరో)తెలంగాణ రాష్ట్రంలో అసంఘటిత శ్రమజీవులకు బతుకు-సామాజిక భద్రత కరువైందని నిజామాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి మొహమ్మద్ అలీ షబ్బీర్ అన్నారు. సోమవారం
నిజామాబాద్ పట్టణ గంజ్ లో హమాలి సంఘం, గుమస్తా సంఘం సభ్యులతో నిజామాబాద్ అర్బన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాజీ మంత్రి మహమ్మద్ అలీ షబ్బీర్ సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో మాట్లాడుతూ, ఎన్నికల్లో మద్దతు తెలిపాలని కోరారు. ఈ సంధర్బంగా అలీ మాట్లాడుతూ,
ఉత్పత్తి పంపిణీ రంగాల్లో పనిచేస్తున్న హమాలి అండ్ గుమస్తా వర్కర్స్ సేవలు చాలా ముఖ్యమైనవన్నారు.
వీరి సేవలు గనక నిలిచిపోతే సరుకులు ఎక్కడి అక్కడే ఉండిపోతాయని ప్రజల వద్దకు సరుకులు చేరకపోతే పరిస్థితులు తీవ్ర సంక్షోభంగా మారుతాయిన్నారు.
అలాంటి ముఖ్యమైన పాత్ర పోషించే శ్రమజీవులకు కనీస సామాజిక భద్రత కల్పించడంలోకెసిఆర్ ప్రభుత్వాము విఫలమైందన్నారు
తెలంగాణ రాష్ట్రంలో సుమారు 600 రైస్ మిల్లు ,మార్కెట్ ,వ్యవసాయ, ఉత్పత్తుల ఎగుమతి దిగుమతుల్లో పట్టణ ప్రాంతాల్లో దుకాణాలలో సివిల్ సప్లై ఎఫ్‌సీఐ గోడౌన్ ట్రాన్స్పోర్ట్, పరిశ్రమలలో లక్షల మంది హమాలీలు, గుమస్తాలు పనిచేస్తున్న వారిని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే
వారికి కార్మిక సామాజిక భద్రత చట్టం ఏర్పాటు చేసి వారికి సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి,
పని భద్రత కల్పించి అర్హులైన ప్రతి హమాలీ కార్మికులకు పింఛన్ సౌకర్యం కల్పించి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తాం అన్నారు.
వివిధ సంస్థల పని చేస్తున్న హమాలీ కార్మికులందరికీ ఈఎస్ఐ పీఎఫ్ సౌకర్యాలు కల్పించి
వీరి న్యాయమైన డిమాండ్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే నెరవేరుస్తామన్నారు.
హమాలి కార్మికులు గుమస్తాలు ఐక్యంగా ఉండి కాంగ్రెస్ పార్టీనీ గెలిపించాలని పిలుపునిచ్చారు
కేసిఆర్ కుటుంబ పాలనకు చరమగీతం పాడాలి. బీజేపీ అధికారంలో వస్తే తెలంగాణ సస్యశ్యామలం- కేంద్ర జాతీయ రహదారుల శాఖ మంత్రి నీతిన్ గడ్కారి
(వి.రాజేందర్ నాథ్)
హైదరాబాద్, నవంబర్ 20:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ స్టేట్ బ్యూరో)తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ పాలనకు చరమగీతం పాడాలని కేంద్ర జాతీయ రహదారుల శాఖ మంత్రి నీతిన్ గడ్కారి అన్నారు. సోమవారం మధ్యాహ్నం ఎల్లారెడ్డి బీజేపీ అభ్యర్థి బాన్సువాడ సుభాష్ రెడ్డి తరపున సిఎస్ఐ. గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన ఎన్నికల బహిరంగ సభకు హాజరయ్యారు. హెలికాప్టర్ లో వచ్చిన కేంద్ర మంత్రి సోమార్పేట్ బేస్ హెలిప్యాడ్ నుండి చర్చి గ్రౌండ్ కు చేరుకొని ప్రసంగించారు. మంత్రి హిందీలో మాట్లాడుతుంటే, బీజేపీ జాతీయ నాయకుడు రామ్మోహన్ తెలుగులో అనువాదిస్తూ చెప్పారు. కేసీఆర్ అవినీతి పాలన, కుటుంబ పాలనతో ప్రజలు విసిగి పోయి మార్పు కోరుకుంటున్నారన్నారు. ఈ కుటుంబ పాలనలో కొడుకు, కూతురు, అల్లునికి మాత్రం జీవనోపాధి కేసీఆర్ కల్పిస్తున్నారన్నారు. ఇలా కుటుంబ పాలంతో కేసీఆర్ రాష్ట్రాన్ని అధోగతి పట్టించారని అన్నారు. బీజేపీలో కుటుంబ పాలన లేదని, నీతి నిజాయితితో కూడుకున్న పాలన ఉందన్నారు. బీజేపీ అధికారంలో వస్తే తెలంగాణ రాష్ట్రం ఎవ్వరు ఊహించని రీతిలో అభివృద్ధి సాధిస్తుంది అన్నారు. తాను కేంద్ర జల వనరుల శాఖ మంత్రి ఉన్న సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టు అనుమతులిస్తే, ప్రాజెక్టును కేసీఆర్ సర్కార్ అవినీతి మయం చేయడం వల్ల ఈరోజు ప్రాజెక్టుకు నష్టం జరిగి ప్రజాధనం వృధా అవుతుందన్నారు. దేశాన్ని బీజేపీ ఒక తాటిపై నడిపిస్తుందన్నారు. దేశంలో కాంగ్రెస్ పాలన ముగిశాక మోడీ పాలనలో ప్రపంచం అంతా కూడా ఇప్పుడు భారత్ వైపు చూస్తున్నారన్నారు.
తెలంగాణలోని అన్ని ప్రధాన రహదారులు జాతీయ రహదారులుగా మారుతాయన్నారు. 2వేల కోట్ల రూపాయలతో తెలంగాణ రాష్ట్రంలో జాతీయ రహదారులుగా మారుతున్నాయని, ఇప్పటికే హైదరాబాద్ నుండి మెదక్- ఎల్లారెడ్డి-బాన్సువాడ-రుద్రుర్ జాతీయ రహదారి పనులు ప్రారంభం అయ్యాయన్నారు. ప్రజలకు సుస్థిర పాలన అందించేది బీజేపీ ఏ అన్నారు. ఎల్లారెడ్డి బీజేపీ అభ్యర్థి బాన్సువాడ సుభాష్ రెడ్డి ని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ సభలో బీజేపీ నాయకులు డాక్టర్.మర్రి రాంరెడ్డి, బాణలా లక్ష్మారెడ్డి, స్థానిక బీజేపీ నేతలు పాల్గొన్నారు.
ఎల్లారెడ్డి, నవంబర్ 20:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్)ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలోని ఆరో వార్డులో సోమవారం ఇంటింటికి తిరుగుతూ బీఆర్ ఎస్ అభ్యర్థి సురేందర్ ను గెలిపించాలంటూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో మున్సిపల్ కౌన్సిల్ సంఘని బాలమాని పోచయ్య, అల్లమ్ శీను, నీలకంఠ, బీఆర్ఎస్ నాయకులు గాదె సత్తయ్య, రామకృష్ణయ్య, కిషన్ తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్, నవంబర్ 20:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ స్టేట్ బ్యూరో)
సీనియర్ రిపోర్టర్ నర్సింగ్ రావు ఆత్మహత్యకు పాల్పడ్డారు. సోమవారం తెల్లవారుజూమున హైదరాబాద్ లోని ఇంట్లో ఉరి వేసుకున్నారు. గత రెండు సంవత్సరాల రెండు సంవత్సరాల నుంచి నర్సింగ్ రావు అనారోగ్యంతో బాధపడుతూ, నాలుగు రోజుల క్రితం నగరంలోని ఓ ఆస్పత్రిలో చేరి ఆదివారం రాత్రి డిశ్చార్జ్ అయ్యారు. ఇంటికి వచ్చిన ఆయన ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈనాడు పత్రికలో సీనియర్ రిపోర్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.
ఎమ్యెల్యేగా గెలిపిస్తే అవినీతి రహిత పాలన అందిస్తా అంటూ 100రూపాయల బాండ్ పేపర్ రాసిచ్చిన కాంగ్రెస్ అభ్యర్థి మదన్ మోహన్ రావు
హైదరాబాద్, నవంబర్ 19:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ జతతే బ్యూరో)ఎల్లారెడ్డి ఎమ్యెల్యేగా తనను గెలిపిస్తే ఎలాంటి అవినీతి అక్రమాలు లేకుండా, నీతి నిజాయితితో కూడిన అవినీతి రహిత పాలన అందిస్తానని ఎల్లారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి కె.మదన్ మోహన్ రావు అన్నారు. ఆదివారం మీడియా సమావేశంలో అవినీతి రహిత పాలన అందిస్తాననీ 100రూపాయల బాండ్ పేపర్ రాసి ఇచ్చారు. తాను ఎంత తప్పితే తన పదవికి రాజీనామా చేస్తాను అన్నారు. తాను అవినీతికి పాల్పడితే తనపై ప్రతి ఒక్కరు కోర్టులో కేసు వేయొచ్చని అందుకే గ్యారంటీ గా బాండ్ పేపర్ రాసి ఇస్తున్న అన్నారు. ఎల్లారెడ్డి అభివృద్ధి ప్రణాళిక పేరుతో ప్రత్యేక మేనిఫెస్టోను విడుదల చేసిన ఆయన తాజాగా మరో అస్త్రాన్ని సందించారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం ప్రభుత్వం ద్వారా వచ్చే కాంట్రాక్టులు గానీ, పథకాల అమల్లో గాని ఒక పైసా కూడా కమిషన్ తీసుకొకుండా నిస్వార్థంగా పనిచేస్తానని స్పష్టం చేశారు. అలా కాకుండా ఒక పైసా కమిషన్ తీసుకుంటే నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని వంద రూపాయల బాండ్ పేపర్ పై నియోజకవర్గ ప్రజలకు రాసిచ్చారు. ఎల్లారెడ్డి నియోజకవర్గానికి ప్రభుత్వం ద్వారా వచ్చే పనులు, నిధులను పూర్తిగా స్థానిక ప్రజాప్రతినిధులకు కేటాయిస్తానని స్పష్టం చేశారు. సంబంధిత బాండ్ పేపర్ ను లింగంపేట్ మండలంలోని షర్పల్లి – సంగారెడ్డిలో గ్రామస్తులు, యువకులు, కాంగ్రెస్ పార్టీ నాయకుల సమక్షంలో మీడియాకు విడుదల చేశారు.
గతంలో కాంగ్రెస్ పార్టీలో గెలిచిన సురేందర్ ఎందుకు అమ్ముడుపోయి కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలతో పాటు.. వచ్చిన కాంట్రాక్టులను ఆంధ్ర వారికి 40 శాతం కమిషన్‌కు కట్టబెట్టాడని మదన్మోహన్ విమర్శించారు. ఎన్నికల్లో నియోజకవర్గ ప్రజలు సురేందర్ కు తగిన బుద్ధి చెప్తారని ఆయన స్పష్టం చేశారు. ఎల్లారెడ్డిలో బీఆర్ఎస్, బిజెపి ఒక్కటే అన్నారు. కాంగ్రెస్ పార్టీ విజయాన్ని అద్దుకునేందుకు అనేక కుట్రలు పన్నుతున్నారని అన్నారు. కానీ ఎల్లారెడ్డి సెగ్మెంట్ ఓటర్ లు కాంగ్రెస్ పార్టీకి జై కోట్టి తనను అత్యధిక మెజారిటీతో గెలిపించబోతున్నారని మదన్ మోహన్ ధీమా వ్యక్తం చేశారు.
నన్ను పిచ్చికుక్క అంటారా…?
- కేసిఆర్ ను బొంద పెడితే వచ్చే నెల నుంచి 4 వేల పెన్షన్
- 200 కోట్లతో ఓట్లు కొల్లగొట్టి, 2000 కోట్ల విలువైన భూములు కబ్జా చేస్తాడు
- గజ్వేల్ లో ఏమి మిగిల్చకుండా భూకబ్జాలు చేసి, కామారెడ్డి పై పడ్డాడు
- భిక్కనూరు రోడ్డు షోలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి
- హైదరాబాద్, నవంబర్ 18:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ స్టేట్ బ్యూరో)
సీఎం కేసీఆర్ వీధి కుక్క అయితే, తనయుడు మంత్రి కేటీఆర్ వీధి కుక్కలా అరుస్తూ ఊళ్లపై పడుతున్నారని, వారి నుంచి మిమ్మల్ని కాపాడదుకే వేటగాడిగా వచ్చానని టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ఫైరయ్యాడు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల కేంద్రంలో శనివారం రాత్రి రోడ్డు షో నిర్వహించారు. అసంఖ్యాకంగా తరలివచ్చిన జనావాహిని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ తోక తొండం తెలియని కేటీఆర్ నన్ను పిచ్చికుక్క అని సంబోధిస్తాడా అంటూ మండిపడ్డారు. గజ్వేల్ లో సీఎం కేసీఆర్ ఆయన బంధువులు వేల ఎకరాలు గుంజుకొని, రైతుల భూములన్నీ ఖతం పట్టించి, పచ్చగా ఉన్న కామారెడ్డి భూములపై కన్నేసి, ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడని ఆరోపించారు. కామారెడ్డి ప్రాంత రైతుల భూములను రక్షించడానికే ఏఐసీసీ అగ్రనేతలు శ్రీమతి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఆదేశాల మేరకే సీఎం కేసీఆర్ పై పోటీ చేసేందుకు తనను ఇక్కడికి పంపించారన్నారు. మాజీ మంత్రి మహమ్మద్ అలీ షబ్బీర్ సీఎం కేసీఆర్ ను ఎదుర్కొనే బలం తనకు సరిపోదని, అగ్ర నేతలకు చెప్పి, తన కు తోడుగా రేవంత్ ను పంపించాలని కోరిన కోరిక మేరకే తనను పార్టీ అధిష్టానం ఇక్కడికి పంపించిందన్నారు. 40 సంవత్సరాలుగా రాజకీయంలో ఉన్న నీకు, అమ్మమ్మ ఊరు, అమ్మ పుట్టిన ఊరు కోనాపూర్ ఇప్పుడు గుర్తుకు వచ్చిందా సిగ్గులేని సన్యాసి కేసీఆర్ అంటూ మండిపడ్డారు. ఇదే ప్రాంతానికి చెందిన లింబయ్య అనే రైతు తనకున్న రెండు ఎకరాలతో పాటుగా, మరో మూడు ఎకరాలు కౌలుకు తీసుకొని పంట పండించి వర్షాలకు నష్టపోయి హైదరాబాదులో కూలీనాలి చేసుకుందామని వచ్చిన వాటితో కూడా అప్పులు తీరకపోవడంతో ట్యాంక్ బండి పై ఉరి వేసుకున్నాడ న్నారు. అప్పుడు అతడి కుటుంబం పరామర్శించేందుకు కేసిఆర్ రాలే మంత్రు లు రాలే రని ఎద్దేవా చేశారు. మనం పండించిన పంట కొనడానికి రాలేరని ,వడగండ్ల వానలు వచ్చి పంట నష్టపోతే పరామర్శించడానికి రాలేరని , పిల్లలకు సర్కారు కొలువులు ఇవ్వడానికి రాలేరని , పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వడానికి రాని కేసిఆర్ ఇప్పుడు కామారెడ్డికి వచ్చి ఎలా ఓట్లు అడుగుతున్నావని, ఇక్కడ ఓట్లు అడిగే హక్కు నీకు లేదన్నారు. కేవలం కామారెడ్డికి భూములు గుంజుకోవడానికి మాత్రమే వస్తున్నాడని ఒక్క ఓటుకు పదివేల రూపాయల చొప్పున ఇచ్చిన 200 కోట్లు దాటవని, 200 కోట్లను కామారెడ్డి ప్రజలకు ఎ రగవేసి, కామారెడ్డి లోని 2000 కోట్లవిలువైన భూములను గుంజుకుంటాడని, కామారెడ్డి ప్రజలు అప్రమత్తంగా ఉండి కే సిఆర్ ను బొంద పెట్టాలని పిలుపునిచ్చారు. ఎన్నికల్లో బొంద పెట్టిన వెంటనే వచ్చే నెల నుంచి 2000 ఉన్న పెన్షన్ 4000 వస్తుందని, అన్ని రకాల సంక్షేమ పథకాలు, మీ పిల్లలకు కొలువులు వస్తాయని భరోసానిచ్చారు. కాంగ్రెస్ కార్యకర్తలను బీఆర్ఎస్ నాయకులు బెదిరిస్తే భయపడవద్దని, నేను కూత వేటు దూరంలోనే ఉన్నానని ఇక్కడికి వచ్చి వారి గుడ్లు పీకి గోలీలాడుతానని హెచ్చరించారు.
మూడు గంటలు ఆలస్యమైనా…ఓపికతో ఉన్న* జనం
మూడు గంటలు ఆలస్యంగా రేవంత్ రెడ్డి రోడ్డు షోకు హాజరైనప్పటికీ ఓపికతో అసంఖ్యాకంగా తరలివచ్చిన జనం ఓపికతో. ఆలస్యంగా వచ్చిన రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో వస్తున్న ఆదరణను చూసి కేసీఆర్ సర్కార్ తట్టుకోలేక తన హెలిక్యాప్టర్ కు ఆటంకం కలిగించిందని, అయినా తాను మీ మీద ఉన్న అభిమానం, మీరిచ్చే ఆశీర్వాదం కోసం విమానం స్పీడుతో తన కారు ను తోలుతూ ఇక్కడిదాకా వచ్చానన్నారు. ఆలస్యమైనందుకు, మిమ్మల్ని కష్ట పెట్టినందుకు నన్ను క్షమించాలని వేడుకున్నారు.
ఎల్లారెడ్డి, నవంబర్ 18,(తెలంగాణ ఎక్స్ ప్రెస్):
భారతీయ జనతా పార్టీ బలపరిచిన ఎల్లారెడ్డి నియోజకవర్గ అభ్యర్థి వడ్డేపల్లి సుభాష్ రెడ్డి తరపున ఎన్నికల ప్రచారంలో భాగంగా, సోమవారం ఎల్లారెడ్డి లో జరిగే “యువ సమ్మేళనం” బహిరంగ సభకు , కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ హాజరు కానున్నట్లు , బిజేపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాణాల లక్ష్మారెడ్డి శనివారం విలేఖరుల సమావేశంలో తెలిపారు. పట్టణంలోని స్థానిక సి ఎస్ ఐ చర్చ్ కాంపౌండ్ లో సోమవారం ఉదయం 11.00 గంటలకు గడ్కరీ హాజరు కానున్నట్లు తెలిపారు. ఇట్టి బహిరంగ సభకు బిజేపి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకులు మాజీ సర్పంచ్ బత్తిని దేవేందర్, జిల్లా అధికార ప్రతినిధి మర్రి బాలకిషన్, పట్టణ అధ్యక్షులు కుశల కంటి సతీష్ , ప్రధాన కార్యదర్శి రాజేష్, బిజేపి నాయకులు దినేష్ రెడ్డి, ధనుంజయ్, గజానన్, గాంధీ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
జుక్కల్ నవంబర్ 18:-( తెలంగాణ ఎక్స్ ప్రెస్)
కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని శాసన ఎన్నికల నేపథ్యంలో శనివారం రోజున జుక్కల్ మండలం లోని హంగర్ గా లాడేగావ్ పేద ఏడగి బీజల్వాడి కతల్ వాడి చండే గావ్ ,మాదాపూర్, పడం పల్లి లో ప్రచారం ప్రారంభిస్తు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు గుర్తు చేసుకొని అభివృద్ధి చేసిన వారిని ఓటయండి అని పేర్కొన్నారు ఈ కార్యక్రమం ఎంపీపీ నిలు పటేల్ పార్టీ అధ్యక్షులు మద్రావ్ దేశాయ్ బోలి గంగాధర్ సాయ గౌడ్ బిఅర్ఎస్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు..