జుక్కల్ నవంబర్ 21:-( తెలంగాణ ఎక్స్ ప్రెస్)
కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని శక్తి నగర్,మతుర తండా,డోన్గావ్ గ్రామాలలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న జుక్కల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి తోట లక్ష్మీ కాంతారావు కు ఘన స్వాగతం పలికిన గ్రామ ప్రజలు…
డోన్గావ్ గ్రామంలో యాదవ సోదరుల ఆత్మీయ కలయికతో గొంగడి వేసుకొని మేక పిల్లను ఎత్తుకున్న తోట లక్ష్మీ కాంతారావు ..
అనంతరం లక్ష్మీ కాంతారావు మాట్లాడుతూ హన్మంత్ షిండే పదిహేను ఏళ్ల పాలనలో జుక్కల్ ఎంతో వెనకబడిందని ఆవేదన వ్యక్తం చేశారు..
పనులు చేయడం చేతకాని అసమర్థుడికి ఈ ఎలక్షన్స్ లో బుద్ధి చెప్పి తరిమికొడదాం అని పిలుపునిచ్చారు..
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి పేదవాడికి ఇళ్లు కట్టిస్తాం, రైతులందరికీ రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తాం,కొత్త రేషన్ కార్డులు ఇస్తాం, రైతుల భూములకు రక్షణ కల్పించే విధంగా నూతన రెవెన్యూ వ్యవస్థను తీసుకొచ్చి కొత్త పాసు బుక్కులు ఇస్తామని హామీ ఇచ్చారు..
అనంతరం హన్మంత్ షిండే సొంత గ్రామం డోన్గావ్ లో ఎస్సీ కాలనీ నుండి తోట లక్ష్మీ కాంతారావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు జరిగాయి…