కామారెడ్డి, డిసెంబర్ 4:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ బ్యూరో)
రాష్ట్రంలో రాబందుల కాలం పోయిందని….కాంగ్రెస్ పాలన వచ్చిందని, భూంపల్లి కాంగ్రెస్ యువ నాయకురాలు గైని భారతి అన్నారు. అదివారం
ఎల్లారెడ్డిమ్యెల్యే మదన్ మోహన్ కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండలంలోని ఎల్లారెడ్డి నియోజకవర్గ ప్రజలకు కార్యకర్తలకు భారీ మెజార్టీతో మదన్ మోహన్ ను గెలిపించిన ప్రజలకు పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా యువ నాయకురాలు గైని భారతి మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో పాటు ఆరు గ్యారెంటీలు ప్రజల్లోకి తీసుకెళ్లడం ప్రతి గ్రామాల్లో మండల ప్రజలకు శిరస్వచ్చి పాదాభివందనం చేస్తున్నానన్నారు . రాష్ట్రంలో రాబందుల కాలం పోయిందని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అభివృద్ధి జరుగుతుందని నమ్మకంతో ప్రజలు ఓట్లేసి గెలిపించడంతో పూర్తి బాధ్యతతో పనిచేస్తామని, ఎల్లారెడ్డి నియోజకవర్గంలో అభివృద్ధి జరుగుతుంది అన్నారు.
V.Rajendernath
కామారెడ్డి, డిసెంబర్ 4:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ బ్యూరో)కామారెడ్డి అయ్యప్ప దేవాలయంలో సోమవారం మాలధారణ చేసిన అయ్యప్ప స్వాములకు భిక్ష(అన్నదానం) ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి గోనే శ్రీనివాస్, అన్న ప్రసాద సేవా సమితి అధ్యక్షులు నస్కంటి శ్రీనివాస్, రఘు కుమార్, పబ్బ శ్రీహరి, కృష్ణారెడ్డి, అయ్యప్ప స్వాములు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
హైదరాబాద్, డిసెంబర్ 4:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ స్టేట్ బ్యూరో)తెలంగాణ కొత్తగా ఏర్పాటయ్యే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏర్పడే కొత్త మంత్రి వర్గ విస్తరణలో కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి సెగ్మెంట్ కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్యెల్యేగా గెలిచిన మదన్ మోహన్ రావుకు ఐటి శాఖ మంత్రి అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. పలు దేశాల్లో ఐటి కంపెనీలు ఉన్న అతనికి ఐటి రంగంలో ఉన్న ప్రావీణ్యతను చూసి టీపీసీసీ ఐటి చైర్మెన్ చేశారు. ఆయన రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడు కావడం గమనార్హం. ఈ సన్నిహిత్యమే ఎల్లారెడ్డి సెగ్మెంట్ కాంగ్రెస్ పార్టీ సీటును, తీవ్ర పోటీలో సైతం దక్కడానికి కారణం అయ్యింది. జిల్లాలోని కాంగ్రెస్ పార్టీలోని ఓ వర్గం తీవ్ర వ్యతిరేకం చేసిన ఆయన టికెట్ ను ఆపలేక పోయారు. చివరకు ఆయన్ను ఓడించే కుట్ర జరిగినప్పటికీ, ఆయనకు ఉన్న ప్రజాదరణ ముందు ఏ కుట్రలు పని చేయలేదు. ఐటి రంగంలో ఉన్న నైపుణ్యతను సద్వినియోగం చేసుకుంటూ, ఓ సిస్టం ప్రకారం ఎన్నికల్లో విజయం 86, 276 ఓట్లు సాధించి, సమీప బీఆర్ఎస్ అభ్యర్థి సురేందర్ పై 23, 621మెజార్టీతో జిల్లాలో మెజార్టీలో సైతం ముందున్నారు. ఒక క్రమశిక్షణ కలిగిన ఉపాధ్యాయుని కుమారుడు మదన్ మోహన్ రావు వ్యవసాయ శాస్త్రంలో పీజీ చేశారు. వృత్తిరీత్యా సాఫ్టువెర్ రంగంలో స్థిరపడి, విదేశాల్లో సాఫ్టువేర్ కంపెనీలు స్థాపించి నేడు ఎమ్యెల్యే అయ్యారు. త్వరంలో మంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయి.
హైదరాబాద్, డిసెంబర్ 4:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ స్టేట్ బ్యూరో)
తెలంగాణ రాష్ట్రానికి నేడు కాబోయే ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి. మూడు దశాబ్దాల క్రితం ఆయన ఓ జర్నలిస్ట్. జాగృతి అనే వార్త పత్రికలో ఆయన జర్నలిస్ట్ గా పని చేసారు. ఓ జర్నలిస్ట్ రాష్ట్ర ముఖ్యమంత్రి కావడం ఇదే ప్రథమం అని చెప్పొచ్చు. పై చిత్రంలో ఖ్యన జర్నలిస్ట్ గా పని చేస్తున్న రోజుల్లోని చిత్రం అది.
హైదరాబాద్, నవంబర్ 29:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ స్టేట్ బ్యూరో)
స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తనయుడు నిజామాబాద్ డీసీసీబీ చైర్మెన్ పోచారం భాస్కర్ రెడ్డిపై బుధవారం బాన్సువాడ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. బాన్సువాడ బీజేపీ అభ్యర్థి యెండల లక్ష్మీనారాయణ ఇంటి పై మంగళవారం అర్ధరాత్రి పోచారం భాస్కర్ రెడ్డి, అతని అనుచరులు పాత బాలకృష్ణ, ప్రమోద్ రెడ్డి, సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి తమ్ముడు శంభు రెడ్డి కొడుకు వినోద్ రెడ్డిలు అక్రమంగా ప్రవేశించి డ్రైవర్లను కొట్టడమే కాకుండా మాజీ ఎమ్మెల్యేను చంపుతామని బెదిరించారని ఆరోపణల నేపథ్యంలో, బీజేపీ అభ్యర్థి ఫిర్యాదు మేరకు కేసు నమోదు అయినట్లు పోలీసులు తెలిపారు.
కామారెడ్డి జిల్లాలో ఓటు హక్కు వినియోగించుకొనున్న6లక్షల 61,163 మంది ఓటర్లుజిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్.
కామారెడ్డి, నవంబర్ 29:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ బ్యూరో)కామారెడ్డి జిల్లాలో
6లక్షల 61వేల 163 మంది ఓటర్లు ఈ నెల 30న ఓటు హక్కు వినియోగించుకొనున్నట్లు
జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లాలో పురుషుల కంటే మహిళా ఓటర్లు ఎక్కువ. కామారెడ్డి జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్ , బాన్సువాడ సెగ్మెంట్ లు ఉన్నప్పటికీ, బాన్సువాడ సెగ్మెంట్ నిజామాబాద్ జిల్లా పరిధిలోని లెక్కల్లో ఉంది. 6లక్షల 61వేల 163 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరిలో 3 లక్షల 21వేల,104మంది పురుషులు, 3లక్షల 40వేల, 022మంది మహిళలు, 37 మంది ఇతరులు తమ తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. కామారెడ్డి సెగ్మెంట్లో 2లక్ష 45, 822 మంది వోటర్లు ఉండగా, 1,18,718 వీరిలో పురుషులు, 1,27,080 మహిళలు, ఇతరులు 24మంది వున్నారు.
ఎల్లారెడ్డిలో 2 లక్షల 20, 531మంది వోటర్లు ఉండగా, పురుషులు 1లక్ష 06, 347, మహిళలు 1లక్ష 14, 182మంది, ఇతరులు ముగ్గురు వున్నారు.
జుక్కల్ నియోజక వర్గంలో 1లక్ష 97వేల, 897ఓట్లరు ఉండగా, వీరిలో 97, 618మంది పురుషులు ఉండగా, 1లక్ష 269మంది మహిళ వోటర్లు, 10మంది ఇతరులు వున్నారు. జిల్లాలో 791పోలింగ్ కేంద్రాల ఉండగా, 75రూట్లు ఏర్పాటు చేశారు. కామారెడ్డిలో 266పోలింగ్ కేంద్రాలకు 21రూట్లు, ఎల్లారెడ్డిలో 270పోలింగ్ కేంద్రాలకు 29రూట్లు, జుక్కల్ సెగ్మెంట్ లో 255పోలింగ్ కేంద్రాలకు 25రూట్లు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి పేర్కొన్నారు.
పోలింగ్ సందర్భంగా ప్రచార కార్యక్రమాలు నిషేధం. జిల్లాలో 144 సెక్షన్ అమలు. జిల్లా ఎన్నికల అధికారి జితేష్ వి పాటిల్
కామారెడ్డి, నవంబర్ 28:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ బ్యూరో)రాష్ట్ర శాసనసభ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను పురస్కరించుకుని ఎలక్షన్ కమిషన్ నియమావళిని అనుసరిస్తూ జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో నవంబర్ 28 మంగళవారం సాయంత్రం 5:00 గంటల నుండి ప్రచార కార్యక్రమాలపై నిషేధం అమలులోకి వచ్చిందని, ఎన్నికలు ముగిసే వరకు జిల్లాలో 144 సెక్షన్ అమలులో ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి జితేష్ వి పాటిల్ తెలిపారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్ లో జిల్లా ఎస్పీ సింధు శర్మతో కలిసి జిల్లా కలెక్టర్ అయిన జిల్లా ఎన్నికల అధికారి జితేష్ వి పాటిల్ మిఫియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ, 48 గంటల సైలెన్స్ పీరియడ్ దృష్ట్యా జిల్లాయేతర వ్యక్తులు ఎవరు కూడా జిల్లాలో ఉండకూడదని స్పష్టం చేశారు. ఎఫ్ ఎస్ టి, ఎస్ ఎస్ టి, ఎంసిసి , పోలీస్ అధికారులు అందరూ అప్రమత్తంగా ఉండాలని, కళ్యాణ మండపాలు, హోటళ్లు, లాడ్జింగ్లు తనిఖీ లు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సెక్షన్ 126(1)(బి) ఆర్ పి యాక్ట్ 1951 ప్రకారం ఒపీనియన్ పోల్, ఎగ్జిట్ పోల్స్ నిషేధమని కలెక్టర్ స్పష్టం చేశారు. నవంబర్ 28 సాయంత్రం ఐదు గంటల నుంచి ఎన్నికలు ముగిసే వరకు జిల్లాలో మద్యం షాపులను మూసివేయించి, డ్రై డేగా ప్రకటించినట్లు వెల్లడించారు.
కామారెడ్డి, నవంబర్ 28:- (తెలంగాణ ఎక్స్ ప్రెస్ బ్యూరో)
కామారెడ్డి జిల్లా కేంద్రంలో పోలీసుల తనిఖీలు కలకలం రేపుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి మండల అధ్యక్షుడు గూడెం శ్రీనివాస్ రెడ్డికి చెందిన ఆఫీసులో ఎన్నికల అధికారులు, ఐటి, ఫ్లైయింగ్ స్క్వార్డ్ అధికారులు మంగళవారం తనిఖీలు నిర్వహించారు. సుమారు రెండు గంటలుగా సోదాలు కొనసాగాయి. ఓటర్లకు పంచేందుకు కార్యాలయంలో భారీగా నగదు దాచారన్న అనుమానంతో పోలీసులు తనిఖీలు చేపడుతున్నారు. పోలీసుల తనిఖీలో భారీగా నగదు లభ్యమైనట్టుగా ప్రచారం సాగుతోంది. నగదు ఎంత అనే వివరాలు మాత్రం ఇంకా తెలియలేదు. అయితే కాంగ్రెస్ నేత గూడెం శ్రీనివాస్ రెడ్డికి కంకర క్రషింగ్ మిషన్ ఉంది. దానికి సంబంధించిన డబ్బులు ఏమైనా కార్యాలయంలో ఉంచారా…? లేక పార్టీకి సంబంధించిన డబ్బును ఉంచారా…? అనే విషయాలపై అధికారులు విచారణ చేపడుతున్నట్టుగా తెలుస్తోంది.
మున్సిపల్ వైస్ చైర్మన్ ఇంట్లో అర్ధరాత్రి హైడ్రామా
అయితే గత అర్థరాత్రి కామారెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి నివాసంలో పోలీసులు భారీగా చేరుకుని తనిఖీలు చేపట్టారు. వైస్ చైర్మన్ నివాసంలో డబ్బులు దాచారన్న అనుమానంతో పోలీసులు తనిఖీలు చేపట్టగా పోలీసులకు నగదు లభించలేదు. అయితే మహిళా పోలీసులు లేకుండా మహిళనైన తన ఇంట్లో అర్ధరాత్రి తనిఖీలు చేపట్టడం పట్ల వైస్ చైర్మన్ ఇందుప్రియ పోలీసులను ప్రశ్నించారు. ఇటీవల వైస్ చైర్మన్ దంపతులు బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ నాయకులే టార్గెట్ గా తనిఖీలు చేపడుతున్నారని కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు
రేవంత్ రెడ్డి పర్యటనకు ముందు పర్యటన తర్వాత
కామారెడ్డి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు టార్గెట్ గా తనిఖీలు జరగడం హాట్ టాపిక్ గా మారుతోంది. ఇవాళ కామారెడ్డి పట్టణంలో చివరి రోజు ప్రచారం సందర్బంగా రేవంత్ రెడ్డి పర్యటనకు ముందు మున్సిపల్ వైస్ చైర్మన్ ఇంట్లో అర్ధరాత్రి తనిఖీలు జరగడం ఇవాళ రేవంత్ రెడ్డి పర్యటన అనంతరం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుని కార్యాలయంలో తనిఖీలు జరగడం సంచలనం సృష్టిస్తోంది. ఎన్నికలకు 36 గంటల సమయం ముందు వరుస దాడులు జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారుతోంది.
ఎమ్మెల్యేగా గెలిపిస్తే అవినీతి రహితపాలన అందిస్తాకామారెడ్డి బీజేపీ అభ్యర్థి రమణ రెడ్డి
కామారెడ్డి, నవంబర్ 27:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ బ్యూరో)కామారెడ్డి నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీలో ఉన్న తనను గెలిపిస్తే కామారెడ్డి సెగ్మెంట్ లో అవినీతి రహిత పాలన అందిస్తానని బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకట రమణ రెడ్డి అన్నారు. సోమవారం కామారెడ్డి ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం ముదిరాజ్ సదర్ సంఘం భవన్ లో తెలంగాణ మనముదిరాజ్ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాష్ట్ర సంఘం నాయకుడు చింతల నీలకంఠం అధ్యక్షతన జరిగింది. ఈ సమ్మేళనంలో పాల్గొన్న ముదిరాజ్ లు ఈ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ప్రకటించారు. ఈ సమ్మేళనంలో పాల్గొన్న బిజెపి అభ్యర్థి రమణ రెడ్డి మాట్లాడుతూ, తనకు స్వచ్చందంగా ముందుకు వచ్చి మద్దతు తెలిపిన ముదురాజ్ లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తను ఈ స్వార్థం లేకుండా ఆలయాలకు , సంఘాలకు తన వంతు సహకారం అంధిస్తునాన్నని, తను గెలిచిన గెలవక పోయిన తన సహాయం మాత్రం అగదన్నారు. ప్రజా సేవ కోసం రాజకీయాల్లోకి వచ్చాను న్యాయమైన పాలన అందించడమే తన లక్ష్యం అన్నారు. తను గెలిచాక అవినీతిలో భాగస్వాములన్న అధికారులు ఎవరైనా ఉంటే స్వచ్చందంగా వెళ్లిపోతారని అన్నారు. కామారెడ్డి ప్రజలకు తను ఎప్పుడు అందుబాటులో ఉంటే అన్నారు. అనంతరం బీజేపీ ఫ్లోర్ లీడర్, మున్సిపల్ కౌన్సిలర్ మోటూరి శ్రీకాంత్ మాట్లాడుతూ, బీజేపీ అభ్యర్థి కామారెడ్డి లోకల్ అని, బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు నాన్ లోకల్ గా వచ్చారని, రేపు వాళ్ళు గెలిస్తే మనల్ని గేట్ లోకి కూడా రానివ్వరని అన్నారు. అందుకే స్థానికుడైన రమణారెడ్డి ని భారీ మెజారిటీతో గెలిపించుకుందాం అన్నారు. ఈ సమావేశంలో బీజేపీ కౌన్సిలర్లు, బీజేపీ నాయకులు, ముదిరాజ్ పెద్దలు, సభ్యులు గోలి వడ్డ శంకర్ చింతల రమేష్ శేఖర్ దాదే బాలరాజ్ పిల్లి మల్లేష్ , బొడ్డు ఆంజనేయులు ,చెన్నం నర్సింలు, సునుగురి భాను , పుట్ట భాస్కర్ , జంగిటి శేఖర్, కనికంటి రాజు, సానబోయిన బాలకృష్ణ , మంద మనోజ్, చింతల అంజయ్య, చింతల శ్రీనివాస్, బట్టు సత్యం, చామంతుల నరసింహులు, జంగిటి రవి, ఆశయ రాజు, కాకర్ల చిన్న శేఖర్ , శంకర్, సుమారు ముదిరాజ్ సంఘ సభ్యులు 500 మంది ల్కుటుంబాలు
బిజెపి పట్టణ అధ్యక్షులు విపుల్ జాయిన్, అవధూతల నరేందర్ హనుమాన్ల సురేష్ ఆకుల భరత్ పాల్గొన్నారు
KCR’s welfare schemes are exemplary for the country. NRI State Forum member Kishore Reddy
Hyderabad, November 26:-(Telangana Express State Bureau) State member of NRIs Forum Kishore Reddy said that the welfare schemes introduced by TRS chief CM KCR in Telangana are ideal for the country. Kishore Reddy from Lingampet mandal in Yellareddy segment, who is working in software in America, has come to India to campaign for yellareddy BRS candidate Jajala Surender. He spoke at a media conference in Yellareddy on Sunday. MLA Surender said that Telangana has welfare schemes which are not available in any other state in the country and yellareddy, which is backward, has been developed a lot by MLA Surender. He said construction of bus stand in Yellareddy town center, construction of hundred bed hospital, integrated market, construction of roads, widening of yella Reddy pedda Cheru embankment, construction of bridges at the cost of crores of rupees on, farmers, irrigation water and drinking water provided to people. He said that there was a lot of publicity for the victory of Surender, who is developing. He alleged that people should vote for TRS candidate Surender, who is a local, and if Madan Mohan Rao, who cannot be a local, wins, he will not be available to anyone. Municipal Chairman Kudumula Satyanarayana, ZPTC Usha Goud, Society Vice Chairman Prashant Goud, Surender, Sharif and others participated in this media meeting.