ఎల్లారెడ్డి, ఫిబ్రవరి 12:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్)
ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రంలోని శ్రీ షిర్డీ సాయి మందిరంలో ఈ నెల 14న వసంత పంచమి 20వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ ధర్మకర్త ముత్యపు వీరేశలింగం తెలిపారు. సోమవారం సాయంత్రం మీడియాతో మాట్లాడుతూ, ఉదయం 6గంటలకు కాకడ హారతితో పూజలు ప్రారంభం అవుతాయని, 6.20కి సాయి దివ్య విగ్రహానికి మంచామృతాల్తో మంగళ స్నానం, అభిషేకం, మహాపూజ, 8.30నిముషాలకు శ్రీ.గణపతి పూజ, స్వస్తి పుణ్యవచనం, మాతృకపూజ, ఋత్విక్ వర్ణం,నవగ్రహపూజలు. 12గంటలకు అన్నప్రసాద వితరణ, సాయంత్రం సాయి రథయాత్ర, పాదుకల ఊరేగింపు, 9గంటలకు శేజహారతితో పూజ కార్యక్రమాలు ముగుస్తాయన్నారు.
V.Rajendernath
ఎల్లారెడ్డి, ఫిబ్రవరి 11:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ )ఎల్లారెడ్డి డివిజన్ పరిధిలో నేరాల నియంత్రణలోనే కాకుండా నేర పరిశోధనలో ప్రజల సహకారం బాగుందని ఎల్లారెడ్డి డిఎస్పీ శ్రీనివాసులు అన్నారు. ఆదివారం ముత్యపు రాఘవులు పెంటయ్య ఫంక్షన్ హాల్ లో పట్టణ ప్రముఖులు కొందరు డిఎస్పీని సత్కరించారు. ఈ సంధర్బంగా డిఎస్పీ మాట్లాడుతూ, ఎల్లారెడ్డి డివిజన్ పరిధిలో డిఎస్పీ గా పని చేయడం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు. తన పోలీస్ డ్యూటీ సర్వీస్ మొత్తం ఎస్ఐ నుండి సిఐ వరకు హైదరాబాద్ లోనే చేయడం జరిగిందని, డిఎస్పీ గా ఎల్లారెడ్డికి రావడం జరిగిందన్నారు. ఎల్లారెడ్డి ప్రాంత ప్రజల మనస్తత్వం చాలా మంచిదన్నారు. పని చేసే అధికారులకు ఇక్కడ మంచి విలువ దొరుకుందన్నారు. డివిజన్ పరిధిలో నేరాల నియంత్రణతో పాటు కేసుల పరిశోధన తీరు పట్ల డిఎస్పీ కృషికి ప్రముఖులు ఈ సత్కారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖులు ముత్యపు వీరేశలింగం, ప్రముఖ జనరల్ సర్జన్ డాక్టర్. నాగేశ్వర్ రావు, రాజులు, సేట్, ఆత్మకూరు మాజీ సర్పంచ్ బాల్ రెడ్డి, పుండరి వెంకన్న, రిటైర్డ్ డిఫెన్స్ అధికారి కుంట రాఘవరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్ ఎన్ యుజె(ఐ)కార్యదర్శి ఉక్కల్ కర్ రాజేందర్ నాథ్, రుద్రుర్ తహశీల్దార్ వెంకటేశం, బాలరాజ్, కిషన్ సెట్, గోపాల్, ఓర శ్రీనివాస్, ఆకుల దుర్గయ్య, పద్మ చంద్ర శేఖర్, ముస్త్యాల రమేష్, ముస్త్యాల సుధాకర్, ఎంసాని సుధాకర్, కాపర్తి కిషన్, ఎర్ర శ్రీను, గంగాధర్, ఓర వీరేశం, ఆకుల వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో “జాప్” యూనియన్ అతిపెద్ద యూనియన్ అయ్యేలా సమన్వయంతో కృషి చేద్దాం… విశాఖ జిల్లా జాప్ అధ్యక్షులు సింగంపల్లి శ్రీనివాస్
విశాఖపట్నం, ఫిబ్రవరి 10:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ స్టేట్ బ్యూరో)విశాఖ జిల్లాలో జర్నలిస్ట్ అసోసియేషన్ అఫ్ ఆంధ్ర ప్రదేశ్(జాప్) యూనియన్ బలోపేతం చేసి, రాబోవు రోజుల్లో ఉగాది సంబరాల కార్యక్రమం ఘనంగా నిర్వహిద్దామని అందుకు మనందరం సమన్వయంతో కలిసి పనిచేద్దామని విశాఖ జిల్లా జాప్ అధ్యక్షులు సింగంపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. శనివారం విశాఖ కాంప్లెక్స్ వద్ద ప్రైవేటు కార్యాలయంలో జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ విశాఖ జిల్లా కార్యవర్గ సమావేశం జరిగినది. ఈ సమావేశంలో అధ్యక్షులు ప్రతి సభ్యునికి భరోసా కల్పిస్తుందని, సింగపల్లి మాట్లాడుతూ రాబోవు రోజుల్లో యూనియన్ ఆధ్వర్యంలో ఉగాది పండుగ సంబరాలు కార్యక్రమాలు జరుపునున్నామన్నారు. యూనియన్ ప్రతినిధి యలమంచిలి ఆదినారాయణ మాట్లాడుతూ, జర్నలిస్ట్ లకు ఇన్సూరెన్స్ సౌకర్యం కోసం కృషి చేస్తాం అన్నారు. జాప్ యూనియన్ రాష్ట్రంలో అతి పెద్ద జర్నలిస్ట్ యూనియన్ గా ఎదిగేలా ప్రతి ఒక్కరి కృషి అవసరం అన్నారు. ల్ యూనియన్ తరపు నుంచి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి కెఎం కీర్తన్, గౌరవ అధ్యక్షులు అప్పల రాజు కోషాధికారి చిరికీ నాయుడు, ఉపాధ్యక్షులు కృష్ణ, జాయింట్ సెక్రెటరీ వడ్డాది వెంకటేష్, ఆర్గనైజింగ్ సెక్రెటరీ రాపర్తి శ్రీనివాసరావు, కార్యవర్గ సభ్యుడు కనకరాజు తదితరులు పాల్గొన్నారు.
ఎల్లారెడ్డి, ఫిబ్రవరి 10:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్)
ఎల్లారెడ్డి అయ్యప్ప ఆలయంలో ఈనెల 14వ తేదీ వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించాలని కమిటీ తీర్మానించింది. శనివారం కమిటీ అధ్యక్షులు పద్మ శ్రీకాంత్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి వి.రాజేందర్ నాథ్ ఆదాయ, వ్యయాలు చదివి వినిపించారు. ఆలయ శాశ్వత కమిటీ సభ్యత్వ రుసుము 18000రూపాయలుగా నిర్ణయించి తీర్మానించారు. అలాగే ఆలయ నిర్మాణం ప్రారంభం నుండి 18000రూపాయల కంటే ఎక్కువ శాతంలో చందాలు అందించిన ప్రతి సభ్యుడు శాశ్వత సభ్యులుగా పరిగనింప బడతారని తీర్మానించారు. ఆలయం చుట్టూ బండల పనులు త్వరితంగా పూర్తయ్యేలా కమిటీ చూస్తామన్నారు. ఆలయం వద్ద బాత్ రూమ్ ల నిర్మాణం చేపట్టాలని సభ్యులు కోరారు. ఈ సమావేశంలో కమిటీ గౌరవ అధ్యక్షులు ముదిగొండ చంద్రం, ఉపాధ్యక్షులు కృష్ణారెడ్డి, కోశాధికారి ఈశ్వర్
గౌడ్, సభ్యులు ప్రశాంత్ గౌడ్, ఓర భీమయ్యా, మురళి, నాగం సాయిబాబా, నవీన్, భూపాల్ పంతులు శ్రీనివాస్ రావు, తదితరులు పాల్గొన్నారు.
ఆపరేషన్ నిమిత్తమై మహిళకు ఓ నెగిటివ్ రక్తం సకాలంలో అందజేతరక్తదాతను అభినందించిన ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు
కామారెడ్డి, ఫిబ్రవరి 4:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ బ్యూరో)కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రైవేటు వైద్యశాలలో ఆపరేషన్ నిమిత్తమై లక్ష్మి (42) మహిళకు అత్యవసరంగా ఓ నెగెటివ్ రక్తం అవసరం కావడంతో వారికి కావలసిన రక్తం రక్తనిది కేంద్రాలలో లభించకపోవడంతో రెడ్డిపేట్ గ్రామానికి చెందిన ప్రశాంత్ గౌడ్ మానవతా దృక్పథంతో స్పందించి, సకాలంలో రక్తాన్ని అందజేసి ప్రాణదాతగా నిలిచాడని ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్, రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ఎంతో మంది రక్తదాతలు ప్రతిరోజు ఆపదలో ఉన్న వారికి రక్తాన్ని అందజేయడం జరుగుతుందని,రక్తదానం చేసిన ప్రతి రక్తదాత ప్రాణదాతనే అని అన్నారు. యువకులు రక్తదానం పట్ల అవగాహనను పెంచుకొని ప్రతి 3 నెలలకు ఒకసారి రక్తదానం చేయడానికి ముందుకు రావాలన్నారు. రక్తదాత ప్రశాంత్ గౌడ్ కు తెలంగాణ టూరిజం కార్పొరేషన్ పూర్వ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ రాజన్నల తరఫున అభినందనలు తెలియజేశారు.
ఎల్లారెడ్డి పెద్ద చెరువులోదూకి నిజాంసాగర్ మండలం బంజాపల్లి తాండకు చెందిన నీలశాంత (33)అనే వివాహిత ఆత్మహత్య చేసుకుందని ఎస్ఐ మహేష్ తెలిపారు. భర్తతో గొడవ పడి ఇంట్లో నుండి కూతురు వెళ్లిందని తల్లి సోనిబాయ్ రాథోడ్ శుక్రవారం నాగిరెడ్డిపేట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదుచేసిందని, శనివారం ఎల్లారెడ్డి పెద్దచెరువులో నీలశాంత మృతదేహాన్నీ కనుగొన్నట్లు ఎస్ఐ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
కామారెడ్డి, ఫిబ్రవరి 3:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ బ్యూరో) పొలం తగాదా విషయమై సొంత చిన్నాన్న అని చూడకుండా, అన్న కొడుకు దాడి చేసి తీవ్రంగా గాయపరిచినట్లు ఎస్ఐ. బొజ్జ మహేష్ తెలిపారు. ఎల్లారెడ్డి మండలంలోని సాతెల్లి గ్రామానికి చెందిన సదానందం అనే వ్యక్తిపై తన అన్న కొడుకు ప్రవీణ్ శనివారం గొడ్డలితో దాడిచేసి గాయపరిచాడని తెలిపారు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ. తెలిపారు.
కామారెడ్డి, ఫిబ్రవరి 3:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ బ్యూరో)తాగుడుకు బానిసైన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఎల్లారెడ్డి మండలం బిక్కనూర్ గ్రామంలో శనివారం జరిగింది. ఎల్లారెడ్డి ఎస్ఐ. బొజ్జ మహేష్ కథనం ప్రకారం బిక్కనూర్ గ్రామంలో చాకలి మోహన్(24)తాగుడుకు బానిసై ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం ఉదయం అతని తల్లి దుర్గవ్వ చూసే సరికి ఉరివేసుకొని చనిపోయి వున్నాడు. రెండేళ్ల క్రితం మోహన్ కు వివాహం కాగా, 9 నెలల పాప ఉంది. భార్యతో గోడవపడగా భార్య పుట్టింటికి వెళ్ళింది. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి శవాన్ని ఎల్లారెడ్డి ఏరియా ఆసుపత్రిలో పోస్ట్ మార్టం జరిపించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ. వివరించారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 3:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ స్టేట్ బ్యూరో)హైదరాబాద్ లోని ఐటీసీ కాకతీయ హోటల్ వేదికగా శనివారం కార్డియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా(సీఎస్ఓ) నిర్వహించిన కార్యక్రమానికి ఎల్లారెడ్డి శాసనసభ్యుడు కె. మదన్ మోహన్ రావు ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఈ సంధర్బంగా ఎమ్యెల్యేను కార్డియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా ప్రతినిధులు జ్ఞాపికతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ జోనల్ చైర్మెన్ వేణు, ఎల్లారెడ్డి సెగ్మెంట్ సీనియర్ కాంగ్రెస్ నేత ఆకుల శ్రీనివాస్ పాల్గొన్నారు