సేవాలాల్ జయంతిని సెలవు దినం గా ప్రకటించడం బంజారాలందరకి దక్కిన గౌరవం: బీపీ నాయక్
బోనకల్ ఫిబ్రవరి 17(తెలంగాణ ఎక్స్ప్రెస్): బంజారాల ఆరాధ్యదైవం శ్రీ సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి సందర్భంగా మండల కేంద్రంలోని రైతు వేదిక ఆవరణంలో ప్రజా ప్రభుత్వం అధికారికంగా ఏర్పాటుచేసిన సేవాలాల్ జయంతి ఉత్సవాలు భోగ్ బండార్ కార్యక్రమంలో కాంగ్రెస్ నేత బీపీ నాయక్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక ఎమ్మార్వో అనిశెట్టి పున్నమ్ చందర్, ఆర్ ఐ లక్ష్మణ్, మాజీ సర్పంచ్ సైదా నాయక్, సబ్ ఇన్స్పెక్టర్ కడగండ్ల మధుబాబు, వైస్ ఎంపీపీ గుగులోత్ రమేష్, మాజీ జడ్పిటిసి బానోతు కొండ, బిజెపి నేత గుగులోత్ నాగేశ్వరరావు,గిరిజన సంఘ నేతలు గుగులోత్ పంత్, గుగులోత్ కిషోర్ లు పాల్గొన్నారు. మొదటిగా సేవాలాల్ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. అనంతరం గిరిజనుల ఆచారం ప్రకారం భోగ్ బండార్ నిర్వహించి ఘన నివాళి అర్పించారు.

ఈ సందర్భంగా బీపీ నాయక్ మాట్లాడుతూ సమాజ శ్రేయస్సు కోసం వారు చూపించిన మార్గం ఆదర్శనీయమని, సేవాలాల్ జయంతి దినోత్సవాన్ని ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించడం హర్షనీయమని, బంజారాహిల్స్ లో బంజారా భవన్, ట్యాంకు బండి పై సేవాలాల్ విగ్రహాన్ని ప్రతిష్టించాలని, గిరిజన సమస్యల పరిష్కారానికి స్పెషల్ లోకయుక్త కోర్టును ఏర్పాటు చేయాలని, రిజర్వేషన్లు పకడ్బందీగా అమలు చేయాలని, గిరిజన ఆచార వ్యవహారాలను, సాంప్రదాయాలను కట్టుబాట్లను కాపాడే విధంగా ప్రణాళికలు చేయాలని, గిరిజన ఆలయాల్లో ధూప దీప నైవేద్య కార్యక్రమాల సంఖ్యను పెంచాలని, ఐక్యతతో గిరిజన సమాజం మరింత అభ్యున్నతి సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘ పెద్దలు, భానోత్ శ్రీను,గుగులోతు రామకృష్ణ, రూప్లా నాయక్, భూక్య సైదులు, బానోత్ శ్రీనివాస రాథోడ్, కోటేశ్వరరావు,గుగులోత్ శ్రీను, భూక్య రమేష్ నాయక్, బాదావత్ సూర్య, వేణు, భూక్య గోపి, ఠాగూర్ వెంకటేశ్వర్లు, గుగులోతు గోపి, దుర్గా, త్రివేణి తదితర నాయకులు పాల్గొన్నారు.