Home తాజా వార్తలు ఆత్మీయ సత్కారం రూరల్ ఎస్ఐ మాలిక్ కు ఘన సన్మానం

ఆత్మీయ సత్కారం రూరల్ ఎస్ఐ మాలిక్ కు ఘన సన్మానం

by Telangana Express

తెలంగాణ ఎక్స్ ప్రెస్ 13/12/24
భైంసా పట్టణం లోని
భైంసా మండల రూరల్ ఎస్ఐగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన మాలిక్ సర్ కి ఘనంగా ఆత్మీయ సత్కారం జరిగింది. ఈ కార్యక్రమంలో హమారా సహారా యూత్ ప్రెసిడెంట్ అయూబ్ అహ్మద్, ఆనందిత ఫౌండేషన్ చైర్మన్ వాడేకర్ లక్ష్మణ్, భైంసా టౌన్ ప్రెసిడెంట్ కషిఫ్, తదితర ప్రముఖులు పాల్గొన్నారు.
కార్యక్రమం ప్రారంభంలో మాలిక్ సర్‌కు శాలువా, పుష్పగుచ్ఛం, గౌరవ గుర్తు అందజేయడం జరిగింది. అనంతరం మాట్లాడిన వాడేకర్ లక్ష్మణ్ మాట్లాడుతూ, మాలిక్ సర్ వంటి సమర్థ నాయకత్వం గ్రామీణ ప్రాంత ప్రజలకు రక్షణతో పాటు ప్రజలతో మమేకం అయ్యే విధంగా పోలీస్ సేవలు అందించేందుకు దోహదపడుతుంది” అని అన్నారు. హమారా సహారా యూత్ ప్రెసిడెంట్ అయూబ్ అహ్మద్ మాట్లాడుతూ, “సమాజంలో చైతన్యం తీసుకురావడంలో పోలీస్ శాఖ పాత్ర ఎంతో ప్రధానమైంది” అని పేర్కొన్నారు.
మాలిక్ సర్ తన ప్రసంగంలో, భైంసా గ్రామీణ ప్రాంతంలో శాంతి భద్రతలు మెరుగుపరచడమే తన ముఖ్య లక్ష్యంగా పెట్టుకున్నానని, ప్రజలతో కలిసికట్టుగా పనిచేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని” అన్నారు. ఈ సందర్భంగా ఆయన అందరి సహకారం కోరారు. కార్యక్రమం ముగింపు సందర్భంగా హమారా సహారా యూత్ ప్రెసిడెంట్ అయూబ్ అహ్మద్ ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, యువ నాయకులు, ఉత్సాహవంతులైన స్థానికులు పాల్గొన్నారు. పోలీస్ శాఖకు ప్రజలు అందించే మద్దతు ఎంత కీలకమో ఈ కార్యక్రమం నిరూపించింది.

You may also like

Leave a Comment