Home తాజా వార్తలు ఎయిడ్స్ కంట్రోల్ పైన అవగాహన సదస్సు నిర్వహిస్తున్న కళాకారులు

ఎయిడ్స్ కంట్రోల్ పైన అవగాహన సదస్సు నిర్వహిస్తున్న కళాకారులు

by Telangana Express

చేగుంటజనవరి 19:–(తెలంగాణ ఎక్స్ ప్రెస్)

నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ వారి సహకారంతో జిల్లా కలెక్టర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి మరియు డిపిఎం డిస్టిక్ ప్రోగ్రాం మేనేజర్ డానియల్ గారి ఆధ్వర్యంలో హెచ్ఐవి ఎయిడ్స్ నియంత్రణపై అవగాహన కళజాత ప్రదర్శన కనకదుర్గ కళా సమితి బుజంగం పొన్నాల.బృందం వారిచే చేగుంట బస్టాండ్ లో ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు కళాకారులు తమ ఆటపాటలతో హెచ్ఐవి ఎయిడ్స్ పైన ప్రజలను చైతన్యపరిచి అవగాహన కల్పించారు ప్రజలు హెచ్ఐవి ఎయిడ్స్ పట్ల అవగాహన కలిగి ఉండాలని అప్రమత్తంగా ఉండాలని సుఖ వ్యాధులు ఉన్నవాళ్లు సురక్ష కేంద్రానికి వెళ్లాలని హెచ్ఐవి గర్భిణీ స్త్రీలు పి పి టి సి టి సెంటర్ కి వెళ్ళాలని ఎయిడ్స్ అంటువ్యాధి కాదని హెచ్ఐవి ఎయిడ్స్ వచ్చిన వారి పట్ల వివక్ష చూపకూడదని హెచ్ఐవి ఎయిడ్స్ ఏ విధంగా సోకుతుందో తెలియజేశారు ఈ కార్యక్రమంలో కళాకారులు భుజంగం మురళి ఓంకారం కృష్ణవిధిమౌళి లక్ష్మీశాంతి మరియు మెదక్ స్కోప్ స్వచ్ఛంద సంస్థ pd ఉప్పలయ్య Drp నగేష్ సూపర్ వైజర్ అమరేందర్ clw రేవతి orw రజిత పాల్గొన్నారు

You may also like

Leave a Comment