ఎల్లారెడ్డి, డిసెంబర్ 13,(తెలంగాణ ఎక్స్ ప్రెస్):
ఎల్లారెడ్డి పట్టణానికి చెందిన బత్తుల హరికృష్ణ తన ద్విచక్ర వాహనం చోరి అయ్యిందని ఫిర్యాదు చేసినట్లు ఎల్లారెడ్డి ఎస్ఐ బొజ్జ మహేష్,శుక్రవారం తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. హరికృష్ణ యొక్క సిబి యూనికాన్ బండి ఈ నెల 11న తన ఇంటి ముందు పార్క్ చేసి, ఉదయం చూసే సరికి తన బండిని గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించినట్లు తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు విచారణ చేపట్టిన ఎల్లారెడ్డి పోలీసులు చోరీకి పాల్పడిన నాగిరెడ్డి పేట్ మండలం జలాల్ పూర్ గ్రామానికి చెందిన దొడ్ల గోపాల్, ఎర్ర అశోక్ లను పట్టుకొని వారి నుంచి బైక్ ను స్వాధీన పరుచుకొని ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు ఎస్ఐ బొజ్జ మహేష్ వివరించారు.
