Home తాజా వార్తలు ఆదరించండి అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తా

ఆదరించండి అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తా

by Telangana Express

బీఎస్పీ అభ్యర్థి సర్దార్ వినోద్ కుమార్

ముధోల్, నవంబర్ 21(తెలంగాణ ఎక్స్ ప్రెస్ ): నియోజకవర్గ ప్రజలు ఆద రిస్తే అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తా మని ముధోల్ బీఎస్పీ అభ్యర్థి సర్దార్ వినోద్ కుమార్ అన్నారు. మంగ ళ వారం నియోజకవర్గ వ్యాప్తంగా పలు మండలాల్లోని గ్రామాల్లో బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు కార్యకర్త లు, అభిమానులు అభ్యర్థి కు మద్దతు గా జోరుగా ప్రచారం నిర్వహిస్తు న్నా రు. ప్రధాన పార్టీలకు ధీటుగా యువ కులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి బీఎస్పీ అభ్యర్థికి మద్దతు ఇస్తూ ఇం టింటా ప్రచారం చేశారు. బహుజన సమాజ్ పార్టీతోనే అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి సాధ్యమని వెల్లడించారు స్వరాష్ట్రంలో బహుజనులు అభివృ ద్ధికి దూరమయ్యారని వాపోయారు. రాజ్యాధికారంతోనే బహుజనులు అభివృద్ధి పథంలో ముందుకెళ్తారని తెలిపారు. గ్రామాల్లో ప్రజల నుండి రోజురోజుకు మద్దతు పెరుగుతుందని వెల్లడించారు. ముధోల్ గడ్డమీద బిఎస్పి జెండాను ఎగురవేసేందుకు అన్ని వర్గాల ప్రజలు మద్దతు ఇవ్వా ల ని కోరారు. పేద కుటుంబానికి చెందిన తనకు పేద, మధ్యతరగతి, రైతు కూ లీలు, వ్యవసాయదారుల బాధలు తె లుస్తాయని అభ్యర్థి సర్దార్ వినోద్ కు మార్ పేర్కొన్నారు. నియోజకవర్గ వ్యా ప్తంగా ప్రతి గడపకు బహుజన్ సమా జ్ పార్టీ మేనిఫెస్టోను చేరే విధంగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బిఎస్పి మండల అధ్యక్షులు సునిల్, పవన్, లక్ష్మన్, సాట్వాజి, తులసి రామ్, విలాస్,స తీష్, శ్రీనివాస్, మీనాజ్,కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment