భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
అధికారులు అందుబాటులో ఉండాలి
సైదాపూర్ జూలై 26
(తెలంగాణ ఎక్స్ ప్రెస్)
హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్
రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అధికారులు, ప్రజాప్రతినిధులు అందుబాటులో ఉంటూ సహాయ చర్యలకు సిద్ధంగా ఉండాలని ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ గారు సూచించారు. సైదాపూర్ మండలంలోని పలు గ్రామాలలో రహదారుల గుండా చెరువులు మత్తడి దూకడంతో ఉధృతంగా ప్రవహించే చెరువులు, వాగుల వద్దకు ప్రజలు వెళ్ళవద్దని విద్యుత్ స్తంభాలు, విద్యుత్ తీగల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలి, వ్యవసాయ, తదితర పరిసర ప్రాంతాల్లో విష సర్పాలతో జాగ్రత్తగా ఉండాలి, శిథిలావస్థలో ఉన్న గృహాలలో ఉంటున్న వారు జాగ్రత్తగా ఉండాలని అవసరమైతే తప్ప ప్రజలు బయటకి వెళ్లకూడదని సూచించారు