ఎల్లారెడ్డి, జులై 26,(తెలంగాణ ఎక్స్ ప్రెస్):
ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రంలోని ఎస్టీఓ (సబ్ ట్రెజరీ ఆఫీస్) కార్యాలయంలో , బుధవారం కామారెడ్డి జిల్లా డి టి ఓ కార్యాలయ అసిస్టెంట్ డైరెక్టర్ సాయిబాబు వార్షిక తనిఖీ నిర్వహించినట్లు, స్థానిక ఎ టి ఓ ఎస్.సురేష్ తెలిపారు. ఈ సందర్భంగా 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఎస్టీఓ కార్యాలయం పరిధి లోని ఉద్యోగుల వేతనాలు , కుటుంబ ఫించన్ దారుల వేతనాలు చెల్లింపు, బిల్లులకు సంబంధించిన రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసినట్లు ఎటిఓ సురేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా ఎస్టీఓ సాయిరెడ్డి, సీనియర్ అసిస్టెంట్ రాజ్ కుమార్, కార్తిక్, ఎల్లారెడ్డి ఎస్టీఓ సిబ్బంది భాస్కర్, రమేష్, శరణ్, శివ తదితరులు ఉన్నారు.