ఎల్లారెడ్డి, ఫిబ్రవరి 14,(తెలంగాణ ఎక్స్ ప్రెస్):
ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రంలోని స్థానిక సాయిబాబా ఆలయంలో, బుధవారం వసంత పంచమిని పురస్కరించుకుని ఆలయ ధర్మ కర్తలు మాజీ ఎమ్మెల్యే బి.జనార్ధన్ గౌడ్, షిరిడీలోని సాయి సంస్థాన్ శాశ్వత సభ్యులు సాయి ప్రకాష్ దేశ్ పాండే, ముత్యపు వీరేశలింగం గుప్త లు ఆలయ 20 వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సాయిబాబా ఆలయంలో ఉదయం 6 గంటలకు ఆలయ పూజారి విజయ్ కుమార్ పంతులు అధ్వర్యంలో కాకడ హారతి, బాబా దివ్య మంగళ విగ్రహానికి పంచామృత స్నానం ను ఆలయ ధర్మ కర్తలచే మహా పూజ కార్యక్రమాలు నిర్వహించారు. తదుపరి గణపతి పూజ, స్వస్తి పున్యహవాచనము , మాతృక పూజ ఋత్విక్ వర్ణం, నవగ్రహ వాస్తు మండలి, ముఖ్య కలశ స్థాపన , గణపతి హోమం, బలిహరణము, పూర్ణాహుతి, మహాదాశిర్వచనము తదితర పూజలను వేద పండితులు శివకుమార్ పంతులు, కృష్ణ పంతులు ధర్మ కర్త దంపతులు , సాయి ప్రకాష్ దేశ్ పాండే, నివేదిత దేశ్ పాండే, గోపాల్ రావు, విజయలక్ష్మి, దంపతులచే హోమ కార్యక్రమం ఘనంగా చేయించారు. మధ్యాహ్న హారతి ఇచ్చి అన్నప్రసాదాన్ని ఏర్పాటు చేశారు. భక్తులు భారీ సంఖ్యలో హాజరై బాబాను దర్శించుకుని, తీర్థ ప్రసాదాలతో పాటు అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. సాయంత్రం 6 గంటలకు సాయిబాబా రథ యాత్ర ను, బాబా పాధుకల పల్లకి సేవ పట్టణం వీధుల్లో ఊరేగించారు. ఈ కార్యక్రమంలో చంద్రం గుప్త, సాయి సేవా మండలి సభ్యులు, భక్త బృందం తదితరులు పాల్గొన్నారు.