చేగుంట జూలై:—(తెలంగాణ ఎక్స్ ప్రెస్)
మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలో మొహరం సందర్భంగా మసీదు వద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారి మహమ్మద్ రఫీ ఆధ్వర్యంలో బుధవారం మసీద్ కమిటీ తో కలిపి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. 12 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు మండల మైనార్టీ కమిటీ అధ్యక్షులు మొహమ్మద్ అలీ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇదేవిధంగా ప్రతి సంవత్సరము మసీదు కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తామని వారు తెలిపారు.
ఈ కార్యక్రమంలో
గ్లోబల్ రియల్ ఎస్టేట్ వ్యాపారి రఫిక్, మండల మైనార్టీ అధ్యక్షులు మామద్ అలీ, మస్జిద్ అధ్యక్షులు మహమ్మద్ షకిల్, సర్పంచ్ మంచికట్ల శ్రీనివాస్, ఖలీల్, నయమతుల్లా, కాలేత్, సాజిత్, అర్ఫత్, ముజాహిద్, హర్షత్, డిష్ రాజు, రాజేష్, శ్రీను, లింగం, పాలకవర్గ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.