లోకేశ్వరం డిసెంబర్ 25
(తెలంగాణ ఎక్స్ ప్రెస్)
*లోకేశ్వర మండలం కానకాపూర్ గ్రామానికి చెందిన ఆనందవర్ధన్ ఖోఖోలో రాణిస్తూ ప్రశంసలు అందుకుంటున్నాడు. నిర్మల్లోని ఓ ప్రైవేటు పాఠశాలలో 9వ తరగతి చదువుకునే ఆనందవర్ధన్ గత నెలలో ఉట్నూరులో నిర్వహించిన జోనల్ స్థాయి ఖోఖో పోటీల్లో నిర్మల్ జిల్లా జట్టు తరఫున పాల్గొని మంచి ప్రతిభ కనబర్చి రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యాడు. అదే నెలలో వికారాబాద్ జిల్లా తాండూరులో నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటీలలో వీరి జట్టు రెండో స్థానంలో నిలిచింది. ఇటీవల ట్రస్మా ఆధ్వర్యంలో నిర్మల్లో నిర్వహించిన పోటీ ల్లోనూ ఆనందవర్ధన్ నాయకత్వంలోని పాఠశాల జట్టు విజేతగా నిలవడంలో ఆయన కీల కపాత్ర పోషించాడు. జిల్లా స్థాయి సీఎం కప్ ఖోఖో పోటీల్లోనూ రాణించి రాష్ట్ర స్థాయికి ఎంపికైనట్లు వ్యాయామ ఉపాధ్యాయుడు కృష్ణ తెలిపారు.*
