Home తాజా వార్తలు ఉత్సాహంగా సాగిన 5కె రన్

ఉత్సాహంగా సాగిన 5కె రన్

by Telangana Express

5కె రన్ నిర్వహించిన ఎన్నికల రిటర్నరింగ్ అధికారిని చంద్రకళ…

చెన్నూర్ మార్చి 28 మంచిర్యాల జిల్లా (తెలంగాణ ఎక్స్ ప్రెస్)

మంచిర్యాల జిల్లా చెన్నూరులో గురువారం 5కె రన్ నిర్వహించారు. ఓటు హక్కు మరియు ఓటు యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు వీలుగా భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు స్వీప్ కార్యక్రమంలో భాగంగా చెన్నూరు మండల కేంద్రంలో ఈ 5కే రన్ నిర్వహించడం జరిగిందని ఎన్నికల రిటర్నరింగ్ అధికారిని చంద్రకళ అన్నారు. ఈ 5కే రన్ కార్యక్రమంలో విద్యార్థులతోపాటు వివిధ వర్గాల వారు పాల్గొని ప్రజాస్వామ్యం పరిణతిని చాటారు.ఈ 5కె చెన్నూరు బస్టాండ్ నుండి పెద్ద చెరువు రావిచెట్టు వరకు సాగింది ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గంగాధర్. రెవెన్యూ సిబ్బంది. మరియు పెద్ద ఎత్తున చెన్నూరు పట్టణ ప్రజలు యువకులు తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment