Home తాజా వార్తలు వీణవంక లో ఘనంగా అంబేద్కర్ వర్ధంతి వేడుకలు

వీణవంక లో ఘనంగా అంబేద్కర్ వర్ధంతి వేడుకలు

by Telangana Express

వీణవంక, డిసెంబర్ 6( తెలంగాణ ఎక్స్ ప్రెస్ ప్రతినిధి).

కరీంనగర్ జిల్లా వీణవంక మండల కేంద్రంలో అంబేద్కర్ వర్ధంతి వేడుకలను ఎమ్మార్పీఎస్ నాయకులు ఘనంగా జరిపారు. వీణవంక బస్టాండ్ ప్రాంగణంలో ఎమ్మార్పీఎస్ నాయకులు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం సీట్లు పంచుతూ వారు మాట్లాడుతూ… డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించి, ప్రతి వ్యక్తికి స్వేచ్ఛ హక్కు కల్పించారని, ప్రజాస్వామ్యంలో కులమతాల రిజర్వేషన్లు, హక్కులను కల్పించి, సమాజంలో సమానత్వాన్ని కల్పించారని, అంబేద్కర్ రాజ్యాంగ రచించడం వల్లే నిమ్న జాతులు సమాజంలో బతకలుగుతున్నాయని, ఈనాటి రాజకీయాలు రిజర్వేషన్ల ఆధారంగా జరగడానికి కారణం రాజ్యాంగమేనని,ప్రపంచ దేశాలు సైతం అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అందులోని చట్టాలను, శాసనాలను అనుసరిస్తున్నారని, ప్రజాస్వామ్యంలో ప్రత్యేక పౌరుడు తను అనుసరించాల్సిన విధివిధానాలను, పాటించాల్సిన నియమాలను రాజ్యాంగంలో పొందుపరచడంతో ఈనాడు పరిపాలన సౌలభ్యం సులభంగా జరుగుతుందని, అంబేద్కర్ సేవలు అనిర్వచనియమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు మాజీ ఎంపీటీసీ తాండ్ర శంకర్, అంబాల మధునయ్య, పర్లపల్లి తిరుపతి,అంబాల శ్రీనివాస్, రెడ్డిపల్లి సర్పంచ్ పోతుల నరసయ్య, దాసరపు రాధాకృష్ణ, దాసారపు శంకర్, కండే మహేందర్, దాసరపు జంపయ్య తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment