Home తాజా వార్తలు అంబేద్కర్ రాజ్యాంగమే దేశాన్ని కాపాడుతోoది

అంబేద్కర్ రాజ్యాంగమే దేశాన్ని కాపాడుతోoది

by Telangana Express

తెలంగాణ ఎక్స్ ప్రెస్ 26/11/23
భైంషా మండలం కేంద్రం లో ని
రాహుల్ నగర్ కాలోని లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ముందు చూపుతో పకడ్బందీగా రాసిన రాజ్యాంగమే నేడు సమస్త భారతావనిని సురక్షితంగా కాపాడుతోoదని ది బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా బైంసా అధ్యక్షులు ప్రసంజీత్ హేమ్లే అన్నారు ఆదివారం రోజున అంబేద్కర్ యువజన సంఘం బిఎస్ఐ ఆధ్వర్యంలో 74 వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ముందుగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి,చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డా.బి. ఆర్.అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలన్నారు రాజ్యాంగాన్ని రక్షించుకుంటూ దేశ సేవకు పునర్ అంకితం కావాలన్నారు ఈ కార్యక్రమంలో బిఎస్ఐ మండలం అధ్యక్షులు దిలీప్ కదం అంబేద్కర్ యూత్ అధ్యక్షులు పి. సాయినాథ్ , బైంసా అధ్యక్షులు ప్రసంజీత్ హేమ్లె, పి. రాములు, గ్రామ సర్పంచ్, ప్రజా ప్రతినిధులు, వి.డి.సి. సభ్యులు, బౌద్ధ ఉపాసిక, ఉపాసకులు మరియు మాజీ శ్రామినర్, బౌద్ధాచార్యులు, కేంద్రీయ శిక్షకులు, బౌద్ధ దమ్మ అభిమానులు, సమస్త బౌద్ధ, అంబేద్కర్ సంఘాల నాయకులు,పదాధికారులు తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment