మిర్యాలగూడ డివిజన్ జనవరి 30 తెలంగాణ ఎక్స్ప్రెస్: స్థానిక బకాల్వాడీ పాఠశాల లో జన విజ్ఞాన వేదిక వారు నిర్వహించిన చెకుముకి మండల స్థాయి టాలెంట్ టెస్ట్ పోటీలో ఆదిత్య పాఠశాల విద్యార్థులు “ప్రధమ స్థానం “లో నిలిచి జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక అయ్యారని పాఠశాల కరెస్పాండంట్ మారుతీ అమరేందర్ రెడ్డి తెలిపి,ఈ సందర్బంగా విజేత లు గా నిలిచిన విద్యార్థులు కె. గణేష్ రెడ్డి(10th), పి. చరణ్ తేజ,(9th) డి. సిరి చందన (8th),ల కు మెడల్స్ నీ బహుకరించి అభినందించారు.అదే విధంగా జన విజ్ఞాన వేదిక వారు సమాజo లోనీ మూఢ నమ్మకాలను పారద్రోలడానికి, ప్రజల లో శాస్త్రయ వైఖరి నీ అలవర్చటానికి, విద్యార్థుల నీ పరిశోధన ల పట్ల అవగాహననీ పెంచటానికి దోహద పడుతున్నారనీ తెలియ చేసారు. ఈ కార్యక్రమం లో పాఠశాల ప్రిన్సిపాల్ బంటు నాగరాజు, వైస్ ప్రిన్సిపాల్ కట్టా అనిత, ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.
జిల్లా స్థాయి చెకు ముకి టాలెంట్ టెస్ట్ కి ఎంపిక అయిన ” ఆదిత్య విద్యార్థులు
52
previous post