విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలి తహసీల్దార్ మోతీరాం
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నూతన డైట్ మెనూ ప్రారంభోత్సవానికి అదనపు కలెక్టర్ కిషోర్ కుమార
లోకేశ్వరం డిసెంబర్ 14
(తెలంగాణ ఎక్స్ ప్రెస్)
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కొత్త డైట్ మెనూ అమలు ప్రారంభోత్సవానికి అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, హాజరయ్యారు లోకేశ్వరం మండల కేంద్రంలో గల,ఎస్సీ హాస్టల్ కు తహసీల్దార్ మోతీరాం, ఎస్ఐ అశోక్,తో కలిసి హాజరయ్యారు ఈ సందర్భంగా ఆదనపు కలెక్టర్ కిషోర్ కుమార్,మాట్లాడుతూ ప్రభుత్వ చేపట్టిన కొత్త డైట్ మెనూ విధానాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు అదనపు కలెక్టర్ కామన్ డైట్ ప్రారంభోత్సవానికి పిల్లల పేరెంట్స్ ని ఆహ్వానించి వారితో మాట్లాడుతూ విద్యార్థులకు కామన్ డైట్ మెనూ శనివారం నుండి అమల్లోకి వస్తుందన్నారు ప్రభుత్వం గతంలో ఉన్న డైట్ చార్జీలు 40 శాతం,నుండి కాస్మెటిక్ చార్జీలను 200 శాతం పెంచిందన్నారు కనీసం పక్షం రోజులకు ఒకసారి అయినా తహసీల్దార్ మోతీరాం, ఆకస్మికంగా హాస్టల్ ను సందర్శించి ఆహారంలో నాణ్యత లోపిస్తే చర్యలు చేపట్టాలని తెలిపారు. విద్యార్థులకు ప్రతిరోజూ సాయంత్రం గుడ్లతో పాటు పండ్లు ఇవ్వాలని సూచించారు. హాస్టల్ లో ప్రత్యేక ట్యూటర్స్ ను నియమించి తరగతులు నిర్వహించాలని కోరారు. ఆహారంలో నాణ్యతా ప్రమాణాలను పరిశీలించిన తర్వాతనే విద్యార్థులకు వడ్డించాలని అన్నారు. అలాగే పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ అర్క మోతీరాం,ఎస్ఐ ఆశోక్, వార్డెన్ శ్రీహరి,విద్యార్థుల తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.


