Home తాజా వార్తలు BRS పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షుడు శ్రీ కేటీఆర్ గారి పిలుపుమేరకు ఆందోళన నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ గారి కోరిక మేరకు రైతులపై జరుగుతున్న వారికి విముక్తి చెందాలి.

BRS పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షుడు శ్రీ కేటీఆర్ గారి పిలుపుమేరకు ఆందోళన నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ గారి కోరిక మేరకు రైతులపై జరుగుతున్న వారికి విముక్తి చెందాలి.

by Telangana Express

. జోగిపేట డిసెంబర్ 17:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్) బి ఆర్ ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు శ్రీ కేటీఆర్ గారి పిలుపుమేరకు ఆందోల్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ గారి కోరిక మేరకు మంగళవారం నాడు, తెలంగాణ రాష్ట్రంలో రైతన్నలపై జరుగుతున్న అరాచకాలు, అణిచివేతల నుండి లగ్గిచర్ల రైతులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న దౌర్జన్యం నుండి రైతులను ఆదుకోవాలని రైతులపై పెట్టిన పోలీస్ కేసుల నుండి విముక్తి చేయాలని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం కు వినతి పత్రాన్ని అందజేశారు, ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ డిబి నాగభూషణం, బిఆర్ఎస్ నాయకులు చాపల వెంకటేశం, అల్మాయిపేట్ మొగులయ్యలు మాట్లాడుతూ లగిచర్ల ఘటన బాధితులను రైతులను వెంటనే విడుదల చేయాలని వారి పై పెట్టిన అక్రమ కేసులు కొట్టివేయాలని కాంగ్రెస్ ప్రభుత్వంను డిమాండ్ చేశారు, ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ నాయకులు కాజా పాషా, పెండ గోపాల్, దాసరి దుర్గేష్, పోచయ్య, ప్రశాంత్ కుమార్, ఎండి రఫిక్, తదితరులు బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment