Home Latest ఏబీవీపీ నుండి ఎన్.ఎస్.యుఐ. లో భారీ చేరికలు :
జిల్లా అధ్యక్షులు ఆరిఫ్

ఏబీవీపీ నుండి ఎన్.ఎస్.యుఐ. లో భారీ చేరికలు :
జిల్లా అధ్యక్షులు ఆరిఫ్

by Telangana Express

మిర్యాలగూడ జులై 26 (తెలంగాణ ఎక్స్ ప్రెస్)

విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ఎన్ ఎస్ యు ఐ నిరంతరం పోరాటం చేస్తుందని నల్గొండ జిల్లా అధ్యక్షులు ఎండి ఆరిఫ్ అన్నారు. బుధవారం
మిర్యాలగూడ పట్టణం లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం రాజీవ్ భవన్ లో ఎన్ ఎస్ యు ఐ జిల్లా అధ్యక్షులు మహమ్మద్ ఆరిఫ్ సమక్షంలో ఏబీవీపీ కార్యకర్తలు భారీ సంఖ్యలో ఎన్ ఎస్ యు ఐ లో చేరారు. ఈ సందర్బంగా ఆరిఫ్ మాట్లాడుతు నిరంతరం విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నందుకుగాను
ఆకర్షితులై భారీ సంఖ్యలో ఎన్ఎస్ యూఐ లో చేరుతున్నారన్నారు.మిర్యాలగూడ ఏబీవీపీ కార్యదర్శి అవుట. రోమన్ కుమార్ ఆధ్వర్యం లో ఏబీవీపీ కార్యకర్తలు, నియోజకవర్గ కమిటి సభ్యులు అందరూ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఎన్ ఎస్ యు ఐ లో చేరారని ఆరిఫ్ పేర్కొన్నారు. రోమన్ మాట్లాడుతూ దేశం లో బిజెపి ప్రభుత్వం రాష్ట్రం లో టిఆర్ఎస్ ప్రభుత్వాలు పూర్తిగా వైఫల్యం చెందాయని దేశ భావిషత్తు కాంగ్రెస్ పార్టీ తోనే సాధ్యం అని అన్నారు.
వారి వెంట ఏబీవీపీ నాయకులు ఎన్. రాము, ఎన్.బాలకృష్ణ, డి వంశీ, డి ఉపేందర్ ,వి.వంశీ, ఆర్. గణేష్, కె.సాంబాశివా, హరి, అనిల్, శివ, కార్తీక్, రాజేష్, రాకేష్ తదితరులు ఎన్ ఎస్ యు ఐ చేరిన వారు ఉన్నారు
ఈ కార్యక్రమం లో పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ సలీం. ఎన్ ఎస్ యు ఐ రాష్ట్ర ఉప్పధ్యక్షులు హరి ప్రసాద్, ఐ ఎన్ టి యు సి నాయకులు చంద్ పాషా, యూతకాంగ్రేస్ వైస్ ప్రెసిడెంట్ ఇమ్రాన్, అజయ్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment