ఎల్లారెడ్డి, ఫిబ్రవరి 22,(తెలంగాణ ఎక్స్ ప్రెస్):
ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రంలోని నిజాంసాగర్ రోడ్డు ప్రాంతంలో గల ఉర్సు షరీఫ్ హజ్రత్ సయ్యద్ షా అబ్బాస్ షావలీ రహమతుల్లా అలై దర్గా ఉర్సు ఉత్సవాలు , ఈ నెల 25 వ తేది ఆదివారం నాడు నిర్వహిస్తున్నామని నిర్వాహకులు, గులాం మహమ్మద్ మహమూద్ అలి శుక్తారి అల్ ఖాద్రీ ముతవల్లి ఆస్థాన ముబారక్ తెలిపారు. ఈనెల 25 వ తేదీన సాయంత్రం ఐదు గంటలకు, ముతవళ్లి ఆస్థాన ముబారాక్ ఇంటి నుంచి గంధం ఊరేగింపుగా తహసీల్దార్ కార్యాలయం వరకు తీయడం జరుగుతుందన్నారు. ఈ నెల 26 న మగ్రిబ్ నమాజ్ తర్వాత సందల్ ముబారక్ ( గంధం) కార్యక్రమం ఉంటుందని, 27 న మంగళవారం సాయంత్రం దీపారాధన ఖురాన్ పఠనం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రజలు కులమత బేధం లేకుండా అధిక సంఖ్యలో పాల్గొనాలని ముత్తవలి ఆస్థాన ముబారక్ కోరారు.