Home తాజా వార్తలు మద్యం మత్తులో పురుగుల మందు తాగి యువకుడు మృతి

మద్యం మత్తులో పురుగుల మందు తాగి యువకుడు మృతి

by Telangana Express


పెద్ద కొడప్గల్ జనవరి 17 (తెలంగాణ ఎక్స్ ప్రెస్):- మండలంలోని బేగంపూర్ తండాలో మద్యం మత్తులో క్రిమిసంహారక మందు తాగి యువకుడు మృతి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని బేగంపూర్ తండాకు చెందిన లంబాడి గురుదాస్ 28 సంవత్సరాలు అనే యువకుడు సోమవారం మధ్యాహ్నం సమయంలో పంట పొలం వద్ద మద్యం తాగి అదే మత్తులో పురుగుల మందు తాగాడు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు కుటుంబ సభ్యులు వెంటనే బాన్సువాడ ప్రభుత్వాస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స చేయించిన అనంతరం మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. చికిత్స పొందుతూ ఉండగా మంగళవారం రాత్రి రెండు 40 నిమిషాలకు మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతునికి మూడు సంవత్సరాల కుమారుడు ఉన్నాడు.భార్య అనిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కోనారెడ్డి తెలిపారు.

You may also like

Leave a Comment