మక్తల్ ముదిరాజ్ జర్నలిస్ట్ ల సంఘం ఆధ్వర్యంలోమక్తల్. జులై. 26 తెలంగాణ ఎక్స్ ప్రెస్): మున్సిపాలిటీ పరిధిలో ఉన్న చందపూర్ గ్రామం వాసి రాజుకు మక్తల్ ముదిరాజ్ జర్నలిస్ట్ సంఘం తరపున ఆర్థిక సహాయం అందించారు. గత కొన్ని రోజుల ముందు మక్తల్ నల్లజానమ్మ టెంపుల్ దగ్గర విధులకోసం రోజువారి కూలీగా వెళుతున్న సమయంలో రోడ్డుపక్కన వెళ్తున్న రాజుకు అటునుంచి వస్తున్న లారీ రాజును ఢీకొనడంతో కాలుకు తీవ్ర గాయాలయ్యాయి. అసలే కటిక పేదరికం రోజు కూలికి వెళ్తే గాని నడవని ఇల్లు, ఆదుకొనే నాధుడే లేక ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం ముదిరాజ్ జర్నలిస్టు సంఘం దృష్టికి రావడంతో ఇట్టి విషయానికి చెలించి మక్తల్ ముదిరాజ్ జర్నలిస్టు సంఘం అధ్యక్షుడు వల్లంపల్లి శివశంకర్ ఆధ్వర్యంలో రాజు కుటుంబానికి రెండు నెలలకు సరిపడు నిత్యావసర సరుకులు 10000/- రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. బాధితుడు రాజు మాట్లాడుతూ నేటి సమాజంలో ఎవరికి ఏమైతేనేమిటి మేము సేఫ్ గా ఉన్నామా లేదా అని ఆలోచించే రోజుల్లో కూడా మాపై దయ తలచి ఆర్థిక సహాయం చేసిన బీసీ జర్నలిస్టులందరికీ కూడా నేను నా కుటుంబం ఎల్లప్పుడు రుణపడి ఉంటామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు అంజన్ ప్రసాద్, సలహాదారులు వాకిటి అంజయ్య ఆచారి, డి.సురేందర్, ప్రధాన కార్యదర్శి వర్కుర్ రాజు, ఉపాధ్యక్షులు తిరుపతి ఆంజనేయులు, కోశాధికారి తిరుపతి వెంకటేష్,కార్యదర్శులు క్షీరానంద్,గాసం నరసింహ, ముదిరాజ్ జర్నలిస్టులు వెంకట్రాములు, అమ్మపల్లి కృష్ణ. డి.రాము, ప్రదీప్, శంకర్, శివ, మక్తల్ సందీప్,మక్తల్ వాకిటి రాజు, మక్తల్ రాంకోటి, మక్తల్ నరేష్, కార్తీక్, తదితర ముదిరాజ్ జర్నలిస్టులు పాల్గొన్నారు
చందాపూర్ వాసి రాజుకి ఆర్థిక సాయం అందజేత
32
previous post