తుంగతుర్తి (తెలంగాణ ఎక్స్ ప్రెస్) డిసెంబర్20 కేంద్రంలోని సీడీపీఓ కార్యాలయంలో మండల అంగన్వాడీ టీచర్ల సంఘం ఆధ్వర్యంలో సూపర్వైజర్ మాకొద్దంటూ శుక్రవారం సీడీపీఓ శ్రీజకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్లు స్వరూప, మంగమ్మ మాట్లాడుతూ తమ విధులకు ఆటంకం కలిగిస్తూ తమ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తుందని, అంగన్వాడి టీచర్లకు జీతాల్లో కోతలు విధించడం చాలా బాధాకరమన్నారు. సూపర్వైజర్ ను ఈ మండలం నుంచి తొలగించి వేరే మండలంలో కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మాధవి, వాణి, పూలమ్మ, ఉమా, సరిత, చంద్రకళ, భారతి, కాంతమ్మ తదితరులు పాల్గొన్నారు.
