ఇద్దరి ప్రాణాలు కాపాడిన తరుణంలో అధికారుల నుంచి ప్రశంసలు
: ఫైర్ మేన్ నవీన్ కుమార్ కు అరుదైన శౌర్య సేవా పతకం
మహబూబ్నగర్: ఫిబ్రవరి 15 జడ్చర్ల అగ్నిమాపక శాఖలో ఫైర్ మేన్ గా విధులు నిర్వహిస్తున్న మహబూబ్నగర్ కు చెందిన చెన్నారం నవీన్ కుమార్ ఫైర్ డిపార్ట్మెంట్ అత్యున్నత సేవా పురస్కారమైన శౌర్య సేవా పతకo అందుకున్నారు.
ఫైర్ డిపార్టుమెంట్ ఏర్పాడినప్పటి నుంచి నేటి వరకు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా ఈ పథకాన్ని పొందిన మొదటి వ్యక్తిగా ఆయన చరిత్ర సృష్టించారు. జడ్చర్ల మున్సిపాలిటీ కావేమ్మపేటలో గల ఫైర్ స్టేషన్ లో ఫైర్మెన్ గా విధులు నిర్వహిస్తున్న నవీన్ కుమార్ గత సంవత్సరం వర్షాకాలంలో వచ్చిన వరద ముంపులో ఇద్దరు మహిళలను ఆయన తన ప్రాణాలకు తెగించి కాపాడారు.ఆయన సేవలను గుర్తించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శౌర్య సేవా పథకం అవార్డును అందజేసింది.మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని బండ్లగేరికి చెందిన చెన్నారం నవీన్ కుమార్ నిరుపేద కుటుoబనికి చెందిన వ్యక్తి అతని తల్లిదండ్రులు చెన్నారం నర్సిములు,అమృత కూలీ పనులు చేస్తు జీవనం సాగించేవారు.2014వ సంవత్సరంలో తన తండ్రి చనిపోగా,2020లో ఆయన తల్లి మృతి చెందింది.ఆయనకు ఇద్దరు అక్కలు,అన్న ఉన్నారు. కష్టపడి తన సొంత తెలివితేటలతో 2016లో ఫైర్ డిపార్టుమెంట్లో ఫైర్మెన్ గా ఉద్యోగం సాధించారు.
ప్రాణాలకు తెగించి ఇద్దరు మహిళలను కాపాడారు.
గత సంవత్సరం సెప్టెంబర్ 11న కురిసిన అత్యధిక వర్షపాతంతో దుందుబినది పొంగిపొర్లింది. కాగా వ్యవసాయ పనులకు వెళ్లిన మిడ్జిల్ మండల పరిధిలోని చిల్వేర్ గ్రామానికి చెందిన మహిళలలు చాకలినీలమ్మ,సుగుణమ్మ దుందుబి వాగు దాటే క్రమంలో వరదల్లో చిక్కుకున్నారు. వెంటనే స్పందించిన రెవెన్యూ అధికారులు సమాచారం ఇవ్వడంతో పైర్ డిపార్ట్మెంట్ అధికారులు,సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు.ఆశాఖ డివిజనల్ ఫైర్ ఆఫీసర్ కిషోర్ కుమార్,అసిస్టెంట్ డివిజనల్ ఫైర్ ఆఫీసర్ ధర్మ సూచనతో ఫైర్మెన్ నవీన్ కుమార్ వరద ప్రవాహనికి ఎదురువెళ్లి తన ప్రాణాలను సైతం లెక్కచెయ్యకుండా అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఆ మహిళలలను వరద ముంపు నుంచి బయటకు తెచ్చి వారి ప్రాణాలను కాపాడారు.
మిస్టర్ తెలంగాణ బాడీ బిల్డర్
లక్ష్యం
:దాతల సహకారం కోసం ఎదురుచూపు
ఫైర్ మాన్ నవీన్ కుమార్ చిన్నప్పటి నుంచి జీoకు వెళ్లడం,ఫౌష్టికహరాన్ని నిత్యం తీసుకుంటూన్నారు.కాగా మిస్టర్ తెలంగాణ బాడి బిల్డర్ గెలుపొందడమే తన లక్ష్యమని తెలిపారు.ప్రతిరోజు వ్యాయామం చేయడానికి జింమ్ కు వెళ్లాల్సి వస్తుందని ఆయన అన్నారు.అదేవిధంగా ప్రతి రోజు పౌష్టికాహారం తీసుకుంటున్నట్లు తెలిపారు. అందుకుగాను ప్రతి నెల 30 వేల రూపాయలు ఖర్చు అవుతున్నాయని అన్నారు. పెద్ద మొత్తంలో ఖర్చవడంతో ఆర్థికంగా చాలా ఇబ్బందులకు గురవుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.డబ్బులు లేకపోవడంతో జిమ్ లో ప్రాక్టీస్ చేయలేకపోతున్ననని అన్నారు.దాతలు స్పందించి తనకు ఆర్థిక సహాయం అందజేస్తే పాలమూరు జిల్లా నుండి మిస్టర్ తెలంగాణ బాడీ బిల్డర్ పోటీలో పాల్గొని గెలుపొంది,జడ్చర్ల ఫైర్ స్టేషన్ కు,మహబూబ్నగర్ జిల్లాకు మంచి పేరు తీసుకొస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు.ఆ శాఖ ఉన్నతాధికారులు కిషోర్ కుమార్ ప్రోత్సాహంతో ముందుకు వెళుతున్నట్టు తెలిపారు.సహాయం చేయాలనుకునే దాతలు తన ఫోన్ నెంబర్ 7036543855 కు సంప్రదించాలని ఆయన కోరారు.