Home తాజా వార్తలు ఆమనగల్లులో విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని నిరసన దీక్ష

ఆమనగల్లులో విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని నిరసన దీక్ష

by Telangana Express
  • ఎబివిపి ఆమనగల్లు శాఖ

కల్వకుర్తి నియోజకవర్గం ప్రతినిధి(ఆమనగల్లు)అక్టోబర్06(తెలంగాణ ఎక్స్ ప్రెస్):

రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండల కేంద్రంలో విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని ఎబివిపి శాఖ ఆధ్వర్యంలో నిరసన దీక్ష నిర్వహించడం జరిగింది
డిమాండ్స్
1)ఆమనగల్లు నుండి దిల్ సుఖ్ నగర్ తరలించిన బీ,సీ హాస్టల్ను తిరిగి ఆమనగల్లులో పున: ప్రారంభించాలని,
2) ఆమనగల్లుకు చెందిన బాలికల గురుకుల హాస్టల్ షాబాద్ లో నడుస్తుంది తిరిగి ఆమనగల్లులో ప్రారంభించాలని, 3)ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనం వెంటనే పూర్తి చేయాలి అని,
4)శిథిలావస్థకు చేరిన ప్రభుత్వ బస్టాండ్ హై స్కూల్ భవనాన్ని మార్చి నూతన భవనం ఏర్పాటు చేయాలని,
5) డిగ్రీకళాశాలకుపాలిటెక్నిక్ కళాశాలకు భవనం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ
ఎబివిపి నాయకులు నిరసన దీక్షను నిర్వహించడం జరిగింది. ఈ దీక్షకు ఎబివిపి పూర్వ నాయకులు శ్రీకాంత్ సింగ్, వరికుప్పల శీను, పాతకోట శ్రీశైలం సంఘీభావం తెలపడం జరిగింది. ఈ డిమాండ్లపై రాష్ట్ర ప్రభుత్వం, ఎమ్మెల్యే తక్షణమే స్పందించకుంటే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ కమిటీ మెంబర్ కదండి శ్రీరామ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గోరెటి భరత్, ఎబివిపి నాయకులు కోట్ర సురేష్, మొక్తల సాయి, తరుణ్ నాయక్, శివ గౌడ్, మల్లేష్, సుమన్ నాయక్ బద్రు నాయక్, శంకర్, సాయి, సునీల్ నాయక్, శివ ముదిరాజ్, సిద్దు, నందు, కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment