Home తాజా వార్తలు కన్నాల రైతు వేదిక లో ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం

కన్నాల రైతు వేదిక లో ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం

by Telangana Express
  • రైతు నేస్తం, రైతు వేదిక వీడియో కాన్సరెన్సింగ్ అనుసంధానం కార్యక్రమం జిల్లా కలెక్టర్ ప్రారంభం

మంచిర్యాల, మార్చి 07, (తెలంగాణ ఎక్స్ ప్రెస్): మంచిర్యాల జిల్లా, బెల్లంపల్లి కన్నాల రైతు వేదిక లో ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రతిష్టాత్మకమైన కార్యక్రమంకు మంచిర్యాల జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్ నాయక్ ఐఏఎస్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. బుధవారం జిల్లాలోని బెల్లంపల్లి పట్టణంలో రైతు నేస్తం, రైతు వేదిక వీడియో కాన్ఫరెన్సింగ్ అనుసంధానం, కార్యక్రమం ప్రారంభోత్సవానికి విచ్చేసిన మంచిర్యాల జిల్లా కలెక్టర్ కు టిపిసిసి ప్రచార కమిటీ జాయింట్ కన్వీనర్ నాతరి స్వామి, ఎంపీపీ శ్రీనివాస్, స్పెషల్ ఆఫీసర్, వ్యవసాయ అధికారులు, స్వాగతం పలికారు. అనంతరం కన్నాల రైతు వేదికలో నూతనంగా ఏర్పాటు చేసిన టెలివిజన్ ని జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా ప్రారంభించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందేశాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరైన రైతులందరికీ చూపించడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రతి వారంలో రెండు రోజులు రైతులకు రైతు వేదికలో శిక్షణ కార్యక్రమాలు ఉంటాయని, దీని ద్వారా రైతులకు, శాస్త్రవేత్తలకు, వ్యవసాయ అధికారులకు సమన్వయ లోపం లేకుండా వారికి వచ్చే కష్టనష్టాలను వ్యవసాయ పంట యొక్క దిగుబడికి సూచనలను సులువుగా నేర్చుకోవడానికి వీలవుతుందన్నారు. రైతులందరికి పంట దిగుబడి పెరుగుతుందని, అదేవిధంగా అతి తొందరలో రైతులందరికీ పంట బీమా పథకాన్ని ప్రవేశపెట్టడం జరుగుతుందన్నారు. ఈ పథకం ద్వారా పంట వేసే ప్రతి రైతుకు పంట బీమా చేపిస్తే, పంట నష్టపోతే వర్షం, పురుగు, నీటి వరద ద్వారా ఎటువంటి కారణాల చేతనైనా, పంట నష్టపోయినట్లైతే దానికి పూర్తి నష్ట పర్యాయం పంట బీమా ద్వారా రైతులకు ప్రభుత్వం చెల్లించడం జరుగుతుందన్నారు. రైతులు నష్టపోకుండా అధైర్య పడకుండా ఉంటుందని, అందరూ వినియోగించుకోవాలని, రైతులు ఆనందాంగా ఉంటేనే రాష్ట్రం ఆనందంగా ఉంటుందని తెలిపారు. రైతుల యొక్క ఆత్మహత్యలన్నిటినీ పూర్తిగా నియమించడమే కాకుండా రైతులు ధైర్యంగా వ్యవసాయం చేసుకోవడానికి దోహదపడుతుందని తెలియజేస్తూ, ముందు ముందు రైతులందరికీ అనేక రకాల సంక్షేమ పథకాలు అందే విధంగా చూస్తామని ముఖ్యమంత్రి కాన్ఫరెన్స్ లో తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ప్రజా ప్రతినిధులు, అధికారులు, బెల్లంపల్లి మండల రైతులు అందరూ హాజరై ఈ కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వీక్షించడం జరిగింది.

You may also like

Leave a Comment