Home తాజా వార్తలు నూతన బోరు మోటారు ఏర్పాటు

నూతన బోరు మోటారు ఏర్పాటు

by Telangana Express

ఎల్లారెడ్డి, ఫిబ్రవరి 22,(తెలంగాణ ఎక్స్ ప్రెస్):

ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలోని 12 వ వార్డు పరిధిలోని హౌసింగ్ బోర్డు కాలనిలో, గురువారం త్రాగునీటి సమస్య తలెత్తకుండా నూతన బోరు మోటార్ ను ఏర్పాటు చేయడం జరిగిందని, వార్డు కౌన్సిలర్ జంగం నీలకంఠం తెలిపారు. బోరు బావిలో నీరు పుష్కలంగా ఉన్నాయని, ఇటీవలే కొత్త బోరు మోటార్ బిగించగా బుదవారం రాత్రి బోరు మోటార్ చెడిపోవడంతో, రాత్రికి రాత్రే స్పందించిన కౌన్సిలర్ తెల్లవారు జామునే వాటర్ వర్కర్స్ సిబ్బంది చే బోరు మోటార్ ను వెలికి తీసి పరిశీలించగా చెడిపోయిందని బోరు మెకానిక్ తెలపడంతో, బోరు మోటార్ కు గ్యారంటీ ఉండటంతో, దాన్ని రీప్లేస్ కింద నూతన బోరు మోటర్ను తెప్పించి బిగించడం జరిగిందని కౌన్సిలర్ నీలకంఠం తెలిపారు. రానున్న వేసవిని దృష్టిలో పెట్టుకొని కాలనిలో నీటి ఎద్దడి ఏర్పడకుండా 24 గంటలలోపే నూతన బోరు ను బిగించడం పట్ల కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేస్తూ, కౌన్సిలర్ నిబద్ధతను కాలని ప్రజలు కొనియాడారు.

You may also like

Leave a Comment