ప్రభుత్వం ఆదుకోవాలని కన్నీటి పర్యంతమైన బాధిత రైతు కుటుంబం….
లోకేశ్వరం నవంబర్ 1
(తెలంగాణ ఎక్స్ ప్రెస్)
పిడుగుపాటుతో ఎద్దు మృతి చెందిన ఘటన నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం లోని పోటపెల్లి,(ఎం) గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గురువారం సాయంత్రం ఉరుములు మెరుపులుతో కూడిన వర్షం కురిసింది అ సమయంలో రైతు బరడోల రమేష్, అనే రైతు తన ఎద్దును చెట్టు క్రింద కట్టేసి ఉంచాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా పిడుగు పడడంతో ఎద్దు ఘటన స్థలంలోనే మృతి చెందింది అని అన్నారు ఎద్దు విలువ దాదాపు రూ 50 వేలు వరకు ఉంటుంది అని తనను ప్రభుత్వమే ఆదుకోవాలని బాధిత రైతు రమేష్, కోరుతున్నారు