సుల్తానాబాద్ మండల్…
సుల్తానాబాద్ మండలంలోని చిన్నకల్వల గ్రామం వద్ద రాజీవ్ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి మృతి చెందాడు .పోలీసులు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కమాన్పూర్ మండలం గుండారం గ్రామానికి చెందిన బాలకృష్ణ ఉద్యోగరీత్యా సుల్తానాబాద్ లో నివాసం ఉంటున్నాడు.బుధవారం పని నిమిత్తం పెద్దపల్లి బైక్ పై వెళ్లి సుల్తానాబాద్ వస్తున్న క్రమంలో చిన్నకల్వల గ్రామం వద్ద వెనుక నుండి లారీ ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు.స్థానికులు వెంటనే కరీంనగర్ ఆసుపత్రి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడికి భార్య కూతురు ఉన్నారు .కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

