Home తాజా వార్తలు అదుపుతప్పి పాతశెడ్డును డీకొని వ్యక్తి మృతి

అదుపుతప్పి పాతశెడ్డును డీకొని వ్యక్తి మృతి

by Telangana Express
  • ఆమనగల్లు సబ్ ఇన్స్పెక్టర్ బలరాం నాయక్

ఆమనగల్లు, డిసెంబర్ 11
(తెలంగాణ ఎక్స్ ప్రెస్):

అదుపుతప్పి ఆదివారం రాత్రి పాతశెడ్డును డీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు శివారులోని షాద్ నగర్ రోడ్డు పక్కన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తలకొండపల్లి మండల పరిధిలోని కర్కాస్ తండా కి చెందిన కేతావత్ గోపాల్ తండ్రి తుల్జా వయసు 45 సంవత్సరాలు అను అతను 10-12-2023 ఆదివారం రోజు ఉదయం కృష్ణ అనే వ్యక్తితో కలిసి ఇద్దరు హీరో హోండా టి.యస్ 06ఈ 4189 బైకుపై కర్కాస్ తండా నుండి విటాయిపల్లికి అతని చెల్లెలు బిడ్డ ఎంగేజ్మెంట్ కోసం వెళ్లి తిరిగు ప్రయాణంలో ఆమనగల్లు శివారులోని షాద్ నగర్ రోడ్డులో పాత రైస్ మిల్ దగ్గర వున్న టర్నింగ్ పాయింట్ వద్ద ఉన్న పాతశెడ్డుకు గుద్దుకుని తలకు ఇతర భాగాలకు బలమైన రక్త గాయాలై అక్కడికక్కడే చనిపోయాడు.

అతని భార్య చిట్టి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.

You may also like

Leave a Comment