ఎల్లారెడ్డి, డిసెంబర్ 22,(తెలంగాణ ఎక్స్ ప్రెస్):
క్రిస్మస్ వేడుకల్లో భాగంగా క్రీస్తు యొద్దకు నడిపించుటలో నక్షత్రం అత్యంత ప్రధానమైంది. ఆదివారం రాత్రి ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలోని గండిమాసాని పేట్ జీవదాన్ చౌరస్తా వద్ద సీఎస్ఐ గండిమాసానిపేట్ సంఘం వారు భారీ నక్షత్రం ఏర్పాటు చేశారు. దీన్ని ఎల్లారెడ్డి సి ఎస్ ఐ చర్చ్ ప్రెస్బ్సిటర్ ఇంచార్జి రేవ ఎర్రోళ్ల ప్రభాకర్ లైట్ స్విచ్ ఆన్ చేసి నక్షత్రాన్ని వెలిగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… క్రీస్తును ధ్యానిస్తూ ఆయన వద్దకు చేరుకోవడానికి నక్షత్రం ప్రధాన దిక్సూచి అని తెలిపారు. క్రిస్మస్ వేడుకలు ప్రారంభించడానికి ముందు నక్షత్రం ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు సుదర్శన్, సామెల్ , ప్రవీణ్, దేవదాస్, పరమేశ్వర్, ఇసాక్, యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
