Home తాజా వార్తలు వాడి వేడిగా సాగిన సర్వసభ్య సమావేశం.. పలు శాఖ అధికారులపై ఎమ్మెల్యే ఫైర్

వాడి వేడిగా సాగిన సర్వసభ్య సమావేశం.. పలు శాఖ అధికారులపై ఎమ్మెల్యే ఫైర్

by Telangana Express


*.అధికారులు పనిచేయడం మరిచినారు.. ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు.
*.గ్రామాల్లో చెరువులన్నీ కబ్జకు గురవుతున్నాయి..
*అధికారులు పనిచేయకపోతే చర్యలు తప్పవు..
పెద్ద కొడఫ్గల్ జనవరి 27 తెలంగాణ (తెలంగాణ ఎక్స్ ప్రెస్):-మండల కేంద్రంలో మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో శనివారం సాధారణ సర్వసభ్య సమావేశం అధ్యక్షుడు వి. ప్రతాఫ్ రెడ్డి సమక్షంలో నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు హాజరుకావడం జరిగింది. ఎమ్మెల్యేను అధ్యక్షులు పుష్ప గుచ్చంతో ఆహ్వానించి శాలువతో సన్మానించారు. ఈ సమావేశంలో ఆయా శాఖలకు సంబంధించిన అధికారులు తమ తమ శాఖ పరమైన ప్రగతి నివేదికను గత మూడు నెలల నుంచి జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను సమావేశంలో ప్రస్తావించడం జరిగింది. రైతు వేదికలు ఇలా ఉపయోగిస్తున్నారు అని మండల వ్యవసాయ అధికారిని అడగక రైతులకు ఇలాంటి సలహాలు సూచనలు సమావేశాలు నిర్వహించడం లేదని ఆయా గ్రామాలకు చెందిన సర్పంచులు తెలిపారు ప్రతి రైతు వేదికలో రైతులతో సమావేశాలు నిర్వహించి నివేదికను సమర్పించాలని వ్యవసాయ అధికారిని సూచించారు. అనంతరం విద్యాశాఖ మండల కేంద్రంలో పరిస్థితి చాలా దారుణంగా ఉందని స్థానిక ఎంఈఓ పర్యవేక్షణ కరువైందని మాలమూలా గ్రామాలలో విద్య అభివృద్ధి జరగడం లేదని పాఠశాలకు వచ్చే ఉపాధ్యాయులు మద్యం సేవించి వస్తున్నారని ఎం ఈ ఓ దేవిసింగ్ పై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం. చేశారు.. అనంతరం మిషన్ భగీరథ అధికారులు పనిచేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని సక్రమంగా పనిచేయకపోతే చర్యలు తప్పవని సూచించారు. ప్రతి ఇంటికి నీరు వచ్చే విధంగా చూడాలని ఆదేశించారు. పశువు శాఖ అధికారి పండరి విధులకు రాకుండా గోపాలమిత్ర వారితో పనులు చేయించుకుని ప్రభుత్వం నుండి వచ్చే అన్ని మందులు వారికి సప్లై చేసి డబ్బులు కాజేస్తున్నారని ఆయా గ్రామానికి చెందిన సర్పంచులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు.

ఇకనుండి అలాంటి పనులు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఉపాధి హామీ గూర్చి ప్రతికూలీలకు అవగాహన కల్పించాలని ఫీల్డ్ అసిస్టెంట్ సరిగా పని చేయకపోతే వెంటనే తొలగించాలని ఎంపీడీవో రాణిని ఆదేశించారు.
నీటిపారుదల శాఖ అధికారిపై ఎమ్మెల్యే ఫైర్.. క్వాంటిటీ పని చేయకుండానే కాస్లాబాద్లో 9.5 లక్షల పని ఇలా జరిగిందని. దానికి సంబంధించిన బిల్లు ఎందుకు చేశారని ఆదేశించారు. పని కొంచెం డబ్బులు మాత్రం బోలెడు.. కాస్లాబాద్ గ్రామానికి చెందిన ఎంపీటీసీ సాయిరాంకు ఇలాంటి సమాచారం ఇవ్వకుండానే పనులు ప్రవేశపెట్టారని అది కూడా సభకు వచ్చినప్పుడు మాత్రమే ఈ సమాచారం అందిందని ఎంపిటిసి తెలిపారు. ఈ చెరువు కట్టకు చేసిన మరమ్మత్తుల గురించి పూర్తి సమాచారం ఇవ్వాలని నీటిపారుదల శాఖ అధికారి రేమాన్ ఆదేశించారు. లేనియెడల కఠిన చర్యలు తప్పవని సూచించారు. అన్ని గ్రామాలలో చెరువులు కబ్జాకు గురవుతున్న పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారని. సర్పంచ్లు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మండల కేంద్రంలోని కొంతమంది అధికారులు పనిచేయడం మరిచారని సూచించారు. వారు తమ అలవాటు మరువకపోతే చర్యలు తీసుకుంటామని సూచించారు. ప్రజల్లో ఉండి ప్రజల సమస్యలను తెలుసుకుని పనిచేయాలని అధికారులను సూచించారు. ప్రతి మండలం నుంచి జిల్లాకు ఒక బస్సు ఉండేలా చూడాలని బస్ సౌకర్యం ఉండాలని డిపో మేనేజర్ను సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వమని ప్రజా సమస్యని తమ సమస్యగా భావించి పనిచేస్తుందని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో దశరథ్, ఎంపీడీవో రాణి, ఎంపీపీ ప్రతాపరెడ్డి, ఎం పి ఓ సూర్యకాంత్, జడ్పిటిసి చంద్రభాగ, సొసైటీ చైర్మన్ హనుమంత్ రెడ్డి, కో ఆప్షన్ నెంబర్ జాఫర్, ఆయా గ్రామాలకు చెందిన సర్పంచులు ఎంపిటిసిలు ఆయా శాఖపరమైన అధికారులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment