-రీజియన్ లోనే అతి ఉత్తమ క్లబ్ గా లయన్స్ క్లబ్ ఆఫ్ ఆమనగల్లు
-రీజియన్ అతి ఉత్తమ అధ్యక్షుడిగా యాచారం వెంకటేశ్వర్లు గౌడ్
-అతి ఉత్తమ కార్యదర్శిగా కే. గోవర్ధన్ రెడ్డి
ఆమనగల్లు, మార్చ్ 12
(తెలంగాణ ఎక్స్ ప్రెస్):
లయన్స్ క్లబ్ ఆఫ్ మల్టిపుల్ 320 జిల్లాలోని గీతాంజలి రీజియన్-3 సమావేశం హైదరాబాద్ కర్మన్ఘాట్ లోని ఏపీ ఆర్ గార్డెన్ లో రీజియన్ చైర్పర్సన్ సాధు ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమావేశం ఆమనగల్లు లయన్స్ క్లబ్ కు 10 అవార్డులు లభించినట్లు పిఆర్ఓ పాషా తెలిపారు. అతి ఉత్తమ క్లబ్ గా నిలిచిందని ఆయన తెలిపారు. అతి ఉత్తమ అధ్యక్షునిగా యాచారం వెంకటేశ్వర్లు గౌడ్, అతి ఉత్తమ కార్యదర్శిగా కే. గోవర్ధన్ రెడ్డి, ట్రెజరర్ గా కొరివి. వెంకటయ్య, అతి ఉత్తమ పిఆర్ఓ గా ఎమ్ ఏ. పాషాలకు అవార్డు లభించినట్లు ఆయన తెలిపారు. ఈ అవార్డ్స్ తో పాటు బెస్ట్ పర్మినెంట్ ప్రాజెక్ట్, బెస్ట్ మెగా హెల్త్ క్యాంప్, బెస్ట్ బ్లడ్ డొనేషన్ క్యాంప్, ఐ క్యాంప్, అన్న ప్రసాదము, మిస్ అండ్ వీల్స్, క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ అవార్డు ఆమనగల్లు లయ న్స్ క్లబ్ కు లభించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏరియా ఎల్సిఐఎఫ్ ఏరియా లీడర్ సందడి. నరేందర్ రెడ్డి, గవర్నర్ హరినారాయణ బటడ్, ఫస్ట్ వైస్ గవర్నర్ కోటేశ్వరరావు, సెకండ్ వైస్ గవర్నర్ మహేందర్ కుమార్ రెడ్డి, ఎల్ఐసిఐ మల్టిపుల్ కోఆర్డినేటర్ జి. చెన్న కిషన్ రెడ్డి, లయన్స్ ఐ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ వి. దామోదర్ రెడ్డి, మాజీ గవర్నర్ రఘు, క్లబ్ అధ్యక్షులు యాచారం. వెంకటేశ్వర్లు గౌడ్, సెక్రటరీ గోవర్ధన్ రెడ్డి, క్లబ్ పిఆర్ఓ పాష, జిల్లా చైర్మన్ కండె. ఓంకారం, అంజయ్య, జూలూరి రమేష్, బండెల. రామచంద్రారెడ్డి, ఏం. చంద్రశేఖర్, బి. యాదయ్య, అర్థం. మనోహర్, గుర్రం కేశవులు, భావండ్ల. వెంకటేష్, సింగల్ విండో చైర్మన్ గంప వెంకటేష్, గంప శ్రీనివాసులు, కే. రామ్ రెడ్డి, కృష్ణమూర్తి, కటికే శ్రీనివాస్ రెడ్డి, బ్రహ్మారెడ్డి, బ్రహ్మారెడ్డి, విష్ణు, వాసు రెడ్డి, జనార్దన్ రెడ్డి, పశువుల లక్ష్మారెడ్డి, గుజ్జరి. నరసింహ, బి. వెంకట్, దోమ. మోహన్ రెడ్డి, అంజిరెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, పురుషోత్తం రెడ్డి, జూలూరు లింగయ్య సభ్యులు తదితరులు పాల్గొన్నారు.