ఎల్లారెడ్డి, మార్చి 11,(తెలంగాణ ఎక్స్ ప్రెస్):
ఎల్లారెడ్డి మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో , సోమవారం మహాశివరాత్రి ఉత్సవాలను పురస్క రించుకుని గ్రామంలోని ఉమాసంఘమేశ్వర స్వామి రథోత్సవంను ఘనంగా నిర్వహించినట్లు గ్రామ పెద్దలు మాజీ సర్పంచ్ మామిడి అరవింద్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా తెల్లవారు జామున కాగడాల వెలుగులో గ్రామ శివారులోని గుట్ట మీద గల ఉమాసంగమేశ్వర ఆలయం దిగువన ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్థలం నుంచి రథాన్ని సుందరంగా అలంకరించి, పార్వతి పరమేశ్వరుల ఉత్సవ విగ్రహాలను గ్రామ పెద్ద ఇంటినుంచి తీసుకు వచ్చి రథంలో ఉంచి రథాన్ని భక్తులు తాళ్ళతో లాగి రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా రథోత్సవం నిర్వహించడం గ్రామ ప్రత్యేకత అని మాజీ సర్పంచ్ మామిడి అరవింద్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు మాజీ సర్పంచ్, శ్రీనివాస్ గౌడ్, మామిడి రవీందర్, మామిడి శ్రీనివాస్, సాయిబాబు, సంగమేశ్వర్ , గ్రామ ప్రజలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.