Home తాజా వార్తలు మా ఇంటి మహాలక్ష్మికార్తీక అక్క శ్రీమంతం కానుక…

మా ఇంటి మహాలక్ష్మికార్తీక అక్క శ్రీమంతం కానుక…

by Telangana Express

చేగుంట నవంబర్ 27 తెలంగాణ ఎక్స్ ప్రెస్

(నియోజకవర్గంలో 8 నెలలు దాటిన గర్భిణీ స్త్రీలకు టీమ్ కార్తిక ఫౌండేషన్ ద్వారా చీర సార్లతో న్యూట్రిషన్ కిట్లు పంపిణీ)

“మా ఇంటి మహాలక్ష్మి”
కార్తీక అక్క శ్రీమంతం కానుక కార్యక్రమంలో భాగంగా టీమ్ కార్తిక ఫౌండేషన్ ఆధ్వర్యంలో *బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు కత్తి కార్తిక గౌడ్ దుబ్బాక మున్సిపాలిటీ 6 వ వార్డు చర్వాపూర్ కి చెందిన పిట్ల శ్యామల గర్భిణి స్త్రీకి చీర సార్లతో న్యూట్రిషన్ కిట్ అందజేయడం జరిగింది.

గర్భిణీ స్త్రీలకు ఈ న్యూట్రిషన్ కిట్లతో ఆరోగ్యంగా ఉండాలని అలాగే తల్లికి ప్రసవ సమయంలో బలంగా ఉండాలని తల్లి బిడ్డ క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని పండింటి బిడ్డ క్షేమంగా ప్రసవించాలని ఈ కార్యక్రమం ఒక గట్టి సంకల్పంతో చేపట్టడం జరిగింది. 

ఈ కార్యక్రమంలో 6 వ వర్డ్ కౌన్సిలర్ సంధ్యా శ్రీనివాస్ రెడ్డి,మూర్తి నారాయణ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చిట్టిపాక కనకయ్య,సీనియర్ నాయకులు కొత్త దేవి రెడ్డి,చిట్టిపాక రాజయల్ల,స్వామి,కామోజీ అనురాధ తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment