Home తాజా వార్తలు గ్యాస్ సిలిండర్ పేలి రేకుల షెడ్డు దగ్ధం

గ్యాస్ సిలిండర్ పేలి రేకుల షెడ్డు దగ్ధం

by Telangana Express

*తమను ప్రభుత్వమే ఆదుకోవాలని బాధిత కుటుంబం ఆవేదన*

లోకేశ్వరం డిసెంబర్ 16
(తెలంగాణ ఎక్స్ ప్రెస్)

లోకేశ్వరం మండలంలో గ్యాస్ సిలిండర్ పేలి రేకుల షెడ్డు దగ్ధమైన ఈ విషాద ఘటన బిలోలి గ్రామంలో చోటు చేసుకుంది గ్రామానికి చెందిన ఇంటి యజమాని భాదోళ్ళ సంజీవ్,రేకుల షెడ్డులో బాగాపురం సాయన్న అద్దెకు ఉంటున్నారని స్థానికులు తెలిపారు రోజువారి కూలిగా పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు రోజులానే ఈరోజు కూడా కూలి పనులకు వెళ్లిన తర్వాత ఈ ఘటన జరిగినట్లు సమాచారం సిలిండర్ పెళ్లి భారీగా మంటలు వ్యాపించడంతో ఇంట్లోని సమంగ్రి తో పాటు దాచుకున్న సొమ్ము ఇంటిలోని వస్తువులు మొత్తం మంటల్లో కాలిపోయాయని సుమారు లక్ష రూపాయల వరకు నష్టం జరిగిందని తమను ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత కుటుంబీకుడు బాగాపురం సాయన్న, కోరుచున్నారు చుట్టుపక్కల ప్రజలు మంటలను ఆర్పి వేశారు బాధిత కుటుంబానికి ప్రభుత్వం గాని అధికారులు గాని నష్టపరిహారం అందించాలని గ్రామస్తులు కోరారు

You may also like

Leave a Comment