Home తాజా వార్తలు షార్ట్ సర్క్యూట్ తో నివాసపు పూరి గుడిసె దగ్ధం

షార్ట్ సర్క్యూట్ తో నివాసపు పూరి గుడిసె దగ్ధం

by Telangana Express


సుమారు లక్షా 60 వేల ఆస్తి నష్టం….
బాధిత కుటుంబానికి కాంగ్రెస్ యువ నేత సాయిబాబా చేయూత…

ఎల్లారెడ్డి, ఫిబ్రవరి 22,(తెలంగాణ ఎక్స్ ప్రెస్):

మండలంలోని లాక్ష్మపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని జన్కంపల్లి ఖుర్దు గ్రామానికి చెందిన మూడ్ భిక్యకు చెందిన నివాస గుడిసె , గురువారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో ప్రమాదానికి గురై పూర్తిగా కాలి పోయింది. స్థానికులు తెలిపిన కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. భిక్య నాయక్ అతని భార్య శారదతో కలిసి కర్ణాటక రాష్ట్రంలో బతుకుదెరువు కోసం చెరుకు కొట్టడానికి వెళ్లారని, ఇంట్లో అతని ముగ్గురు పిల్లలు నవీన (10), రామచందర్ (8), శ్రీచరణ్ (4) ఇంట్లో ఉంటున్నారు. మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో ఇంట్లోకి వస్తున్న కరెంటు వైరు షార్ట్ షార్క్యూట్ అయి ఒక్క సారిగా మంటలు అంటుకో వడంతో, భోజనం చేస్తున్న పిల్లలు ఒక్కసారిగా అరవడంతో చుట్టుపక్కల వారు, ప్రజలు మంటలు ఆర్పివేసే ప్రయత్నం చేశారు. ఈ లోగా అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇవ్వడంతో చేరుకున్న వాహనంతో చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. అలోపే జరగాల్సిన నష్టం జరిగింది. ఈ ప్రమాదంలో ఇంట్లో ఉన్న బియ్యం, దుస్తులు, వెండి, పట్టా పాస్ బుక్, ఆధార్ కార్డులు, ఆహార భద్రత కార్డు తదితర సర్టిఫికెట్లు కాలి పోయాయి. దీంతో పిల్లలు బోరున విలపించారు. ప్రమాద సంఘటన స్థలానికి ఆర్ఐ శ్రీనివాస్ సందర్శించి నష్టం వివరాలు బాధిత కుటుంబ సభ్యులను అడిగి తెలుసు కున్నారు. సుమారు 1.60 వేల వరకు ఆస్తి నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. అగ్ని ప్రమాద విషయం తెలుసుకున్న జాతీయ సంక్షేమ బీసీ సంఘం మండల అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ యువ నేత కురుమ సాయిబాబా లక్ష్మాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ రవీందర్ గౌడ్ తో కలిసి ప్రమాద స్థలికి చేరుకుని చిన్నారులను ఓదార్చి, తక్షణ సహాయం గా బియ్యం, నిత్యావసర సరుకులు అందించారు. నిలువ నీడ కోల్పోయిన చిన్నారుల విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ దృష్టికి తీసుకువెళ్ళి వారికి జీవనాధారం తో పాటు నివసించడానికి గూడు కోసం ఎమ్మెల్యే మదన్ మోహన్ ద్వారా అదుకునేలా చూస్తానని అన్నారు. గ్రామస్తులు ఫోన్ ద్వారా చిన్నారుల తల్లి తండ్రులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకుని కర్ణాటక నుంచి బయలుదేరినట్లు తెలిపారు. ఇంట్లో ముగ్గురు చిన్నారులు ఉండటం విశేషం రాత్రి పూట వారి బంధువుల ఇంట్లో ఉండేవారని గ్రామస్తులు తెలిపారు.

You may also like

Leave a Comment