Home తాజా వార్తలు డిజె డ్యామేజ్ చేసిన నలుగురిపై కేసు నమోదు… ఎల్లారెడ్డి ఎస్ఐ బొజ్జ మహేష్

డిజె డ్యామేజ్ చేసిన నలుగురిపై కేసు నమోదు… ఎల్లారెడ్డి ఎస్ఐ బొజ్జ మహేష్

by Telangana Express

ఎల్లారెడ్డి, డిసెంబర్ 13,(తెలంగాణ ఎక్స్ ప్రెస్):

డిజే సౌండ్ సిస్టంను నలుగురు వ్యక్తులు డ్యామేజ్ చేశారని పవార్ సాయి తరుణ్ ఫిర్యాదు చేసినట్లు ఎస్ఐ బొజ్జ మహేష్ శుక్రవారం తెలిపారు. ఎస్ఐ తెలిపిన కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఎల్లారెడ్డి పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా సమీపంలో నివసిస్తున్న పవార్ సాయి తరుణ్ ఇంటి వద్ద షెడ్ లో ఉన్న తన యొక్క డీజే ను నాగిరెడ్డి పేట్ మేల్లకుంట తండా, మహాదేవుని గడ్డ తండాకు చెందిన రాందాస్, విట్టల్, అనిల్, నరేందర్ అను నాల్గురు వ్యక్తులు ఈ నెల 11న ఉదయం 3.20 నిమిషాలకు గూడ్స్ వాహనంలో వచ్చి డీజే లో ఉన్న ఆమ్ప్లిఫయర్లు ధ్వంసం చేసి, వైర్లను తెంపివేయడం వల్ల సుమారు 3.50 లక్షల మేర నష్టం వాటిల్లిందని, అలాగే డీజే వాహనంలో ఉన్న పసుపు రంగు టాపర్ ను దొంగలించారని, పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా…ఈ మేరకు పోలీసులు సిసి కెమెరాల పుటేజీల ఆధారంగా కేసు నమోదు చేసి, పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ ఐ బొజ్జ మహేష్ వివరించారు.

You may also like

Leave a Comment