Home తాజా వార్తలు డివైడర్ ను కారు ఢీ కొట్టి ఒకరు మృతి..

డివైడర్ ను కారు ఢీ కొట్టి ఒకరు మృతి..

by Telangana Express

పెద్ద కొడప్గల్ జులై 27 (తెలంగాణ ఎక్స్ ప్రెస్):- జాతీయ రహదారి 161 పై డివైడర్ను కారు ఢీ కొట్టి ఒకరు మృతి చెందిన సంఘటన గురువారం నాడు చోటు చేసుకుంది. వివరాల ప్రకారం మండల కేంద్రంలోని జాతీయ రహదారి 161 పెద్ద కొడప్గల్ బ్రిడ్జి పై ఉన్న డివైడర్ను నాందేడ్ నుండి హైదరాబాద్ కు వెళ్తున్న కారు ఇన్నోవా క్రిష్ట MH 26BD6699 నంబరు గల వాహనం అదుపుతప్పి ఢీకొంది అందులో ప్రయాణిస్తున్న డ్రైవర్ అబ్దుల్ అఫ్రోజ్ తండ్రి అబ్దుల్ ఖదీర్ (26) గాయలు కాగా, సైక్ ముత్తోగి తండ్రి అజ్మీరుద్దీన్ (24) అక్కడికక్కడే మృతి చెందాడని ఎస్ఐ కోనారెడ్డి తెలిపారు. గాయాలైన సైక్ మత్తోగి చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు ఎస్సై కోనా రెడ్డి పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు తెలిపారు.

You may also like

Leave a Comment