– తెలుగుదేశం పార్టీ నాయకులు మధుసూదన్ రెడ్డిమక్తల్. జులై .31:- (తెలంగాణ ఎక్స్ ప్రెస్) : పట్టణ కేంద్రంలో నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకుల మధుసూదన్ రెడ్డి సోమవారం పత్రిక సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణలో బి ఆర్ ఎస్ ప్రభుత్వం కేసీఆర్ ముఖ్యమంత్రి గారు ఎంతో పెద్ద ఆలోచన చేసి అన్ని కులాల బీదవారికి స్కీములు ప్రవేశపెట్టి వారి ఆదుకొని ప్రజలలో ఎంతో మన్ననలను ప్రభుత్వము పొందుతున్నది. అలాగే అగ్రవర్ణాల కులాల బీదలు కూడు గుడ్డ లేక రెక్కాడితే డొక్కాడని వారు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. వారి పిల్లల చదివించలేక కూలి పనులకు వెళ్తున్నారు. ఆర్థిక ఇబ్బందులతో కుటుంబంలో ఎన్నో సమస్యలతో సతమతమవుతున్నారు. బంగారు తెలంగాణలో కేసీఆర్ గారు వారిపై కూడా దయవుంచి మిగతా కులాలకు బందులు ఏ విధంగా పెట్టారో అదేవిధంగా అగ్రవర్ణాల కులాల బీదవారిని కూడా ఆదుకోవాలని కుటుంబ పెద్దలు, యువకులు, అగ్రవర్ణాల కూలీలు కోరుచున్నారు. కావున తెలంగాణ ప్రభుత్వము కెసిఆర్ గారు వారిని ఆదుకోవాలని అన్నారు.
అగ్రవర్ణాల కులాల బీదవారికి కూడా స్కీములు ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలి…
28
previous post