కామారెడ్డి, జూలై 22:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ బ్యూరో)మణిపూర్ లోని మెజార్టీ వర్గమైన మేయితీయులు, మైనార్టీ వర్గమైన కుకీ జో గిరిజన తెగల అమ్మాయిలను ముగ్గురిని మణిపూర్ రాజధాని ఇంపాల్ కు 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న నాంగ్పొక్ సెక్మయ్ సమీపంలో ఈ నెల నాలుగున ముగ్గురమ్మాయిలను బహిరంగంగా వివస్త్రలను చేసి, నగ్నంగా ఊరేగించి ఆ అమ్మాయిలపై అత్యాచారం చేసి ఆపై హత్య చేసిన దుర్మార్గులను కఠినంగా శిక్షించాలని అంబేద్కర్ సంఘం జిల్లా అధ్యక్షులు ఆకుల బాబు ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘ రాష్ట్ర అధ్యక్షులు వెంకట్ అన్నారు. శనివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ ముందు వర్షంలో మణిపూర్ సంఘటనకు నిరసన తెలియజేశారు. మనుషులు మతం పిచ్చిలో పడి మానవత్వాన్ని మరిచిపోయి తోటి మనిషి తోటి మనిషిని హింసించడం హేయమైన చర్యగా అభివర్ణించారు మనీ పూర్ లో మతం, కులం పేరు మీద చాలా దాడులు జరుగుతున్నాయి అక్కడ ఉన్నటువంటి బిజెపి ప్రభుత్వం దీనికి బాధ్యత వహించి ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అన్నారు. ఓట్ల కోసమే దళితులు కావాలి కానీ హక్కుల కోసము సమానత్వము కోసము దళితుల అవసరం లేదు అనే విధంగా బిజెపి ప్రభుత్వం వ్యవహరిస్తుందని దీన్ని ప్రజలు గమనించాలని కోరారు. బీఎస్పీ జిల్లా అధ్యక్షులు బాలరాజు ,అంబేద్కర్ సంగం రాష్ట్ర ఉపాధ్యక్షులు సంగి రాజలింగం మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా స్త్రీల మీద దాడులు జరుగుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం మోడీ గారు గాని అమిత్ షా గాని కనీసం స్పందించకపోవడం సిగ్గుచేటని చెప్పారు వెంటనే కేంద్ర ప్రభుత్వం ఈ చర్యలపై కఠినంగా వ్యవహరించాలని మహిళలను రేప్ చేసి చంపి వేసిన దుండగులను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. వెంటనే నిందితుల అరెస్టు చేసి శిక్షించాలని ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు దిశా నిర్దేశం చేయాలని కోరారు. బివిఎం రాష్ట్ర కార్యదర్శి ఙివియం విట్టల్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాల వల్లనే స్త్రీలపై దళితులపై అమానుషంగా దాడులు జరుగుతున్నాయని దీనికి మతమే ప్రధాని ఆయుధంగా వారు వాడుతున్నారని కాబట్టి మతం పిచ్చిలో ఇలాంటి దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని భవిష్యత్తులో బిజెపికి తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. తెలంగాణ రచయిత సంగం జిల్లా బాధ్యలు శంకర్ ,కిరణ్మయి,బహుజన విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షులు నారాయణ, పిడి యస్ యూ రాష్ట్ర కోశాధికారి సురేష్ బీడీఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు సురేష్ ,టిిటిసి జిల్లా అధ్యక్షులు బాలయ్య, డిటిఎఫ్ జిల్లా అధ్యక్షులు దేవుల నాయక్, టిపిటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్, టీఎస్ యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు రాజ వర్ధన్, భారతీయ విద్యార్థి సంగం జిల్లా ప్రధాన కార్యదర్శి యశ్వంత్, ఉపాధ్యక్షులు ప్రభాకర్, అనిల్ కుమార్,అంబేద్కర్ సంఘ జిల్లా బాధ్యులు నారాయణ, సాయి మౌర్య , నాంపల్లి ,బాబ్ల్యూ పాల్గొన్నారు.
previous post