Home తాజా వార్తలు మిర్యాలగూడ కాంగ్రెస్ కార్యాలయంలో తోపులాట వాగ్వివాదం… చినిగినకార్యకర్త అంగి : గాల్లోకి లేచినకుర్చీలు..

మిర్యాలగూడ కాంగ్రెస్ కార్యాలయంలో తోపులాట వాగ్వివాదం… చినిగినకార్యకర్త అంగి : గాల్లోకి లేచినకుర్చీలు..

by V.Rajendernath

పరస్పర దూషణలు.. మరోసారి బహిర్గతమైన వర్గ పోరు… పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు..?

మిర్యాలగూడ ఫిబ్రవరి 6 (తెలంగాణ ఎక్స్ ప్రెస్) మిర్యాలగూడ కాంగ్రెస్ పార్టీలో మరోసారి వర్గం పోరు బయటపడిందని కార్యకర్తలు వాపోతున్నారు. పార్టీ ఆదేశాలను అనుసారం సమిష్టిగా చేయవలసిన కార్యక్రమాలను ఏకపక్షంగా చేస్తుండడంతో సోమవారం మిర్యాలగూడ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పరస్పర దూషణల మధ్య కొంతసేపు ఉద్రిక్తతల నడుమ తోపులాట, వాగ్వివాదం చోటు చేసుకున్న సంఘటన జరిగింది. వివరాలుపరిశీలించినట్లయితే..
ఇంటింటికి కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ సందేశాన్ని తీసుకెళ్లడమే లక్ష్యంగా “హాథ్ సే హాథ్ జోడో” కార్యక్రమాన్ని నల్గొండ జిల్లా వ్యాప్తంగా సోమవారం నుంచి ప్రారంభించాలని టిపిసిసి పిలుపుమేరకు మిర్యాలగూడ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సమిష్టిగా కేంద్ర ప్రభుత్వ, అనుబంధ కార్యాల వద్ద నిరసన కార్యక్రమం చేపట్టాలని పిలుపునివ్వడంతో స్థానిక ఎల్ఐసి కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ చెందిన కొందరు ముఖ్యులు కార్యకర్తలు ధర్నాలో పాల్గొన్నారు. ఈ ధర్నాకు డీసీసీ అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్ హాజరై తిరిగి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మిర్యాలగూడ మున్సిపల్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ బత్తుల లక్ష్మారెడ్డి (బిఎల్ఆర్) పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు నూకల వేణుగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ కౌన్సిలర్లు, ముఖ్య నేతలు, నాయకులు, కార్యకర్తలు మిర్యాలగూడ పట్టణంలో తాము పాల్గొనక ముందే కార్యక్రమం ఏ విధంగా చేస్తారని ప్రశ్నించారు. దీంతో ఇరు వర్గాల కార్యకర్తల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుని కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. పరస్పర దూషణల మధ్య కార్యకర్తల, తోపులాట, గాల్లో కుర్చీలు లేచాయి. ఒక కార్యకర్త అంగి చినిగింది. కొందరు ముఖ్య నాయకులు ఇరువర్గాల కార్యకర్తలను శాంతిప చేశారు. మిర్యాలగూడలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నప్పటికీ వర్గ పోరు నాయకుల మధ్య సమన్వయం లోపంతో కార్యకర్తలు ఎటు వెళ్లలేక పోతున్నారని, తద్వారా కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుందని పలువురు కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా మిర్యాలగూడ పట్టణంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఇచ్చిన పిలుపుమేరకు హాథ్ సే హాథ్ జోడో” కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు బి ఎల్ ఆర్ నాయకత్వంలో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ సందేశాన్ని ఇంటింటికితీసుకెళ్తామని,కౌన్సిలర్లు, మరికొందరు కార్యకర్తలు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ఇరువర్గాల చెందిన నాయకులు మిర్యాలగూడ పట్టణ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.

.

You may also like

Leave a Comment