Home తాజా వార్తలు వందేళ్లలో ఎప్పుడు రానంత వరద వచ్చింది103ఏళ్ళ పోచారం ప్రాజెక్టు వర్ధను తట్టుకొని కాపాడిందివర్ధల్లో ఎమ్మెల్యే మదన్ మోహన్ పని తీరు భేష్వరద బాధితులను ఆదుకుంటాంరాష్ట్ర ముఖ్యమంత్రి. రేవంత్ రెడ్డి

వందేళ్లలో ఎప్పుడు రానంత వరద వచ్చింది103ఏళ్ళ పోచారం ప్రాజెక్టు వర్ధను తట్టుకొని కాపాడిందివర్ధల్లో ఎమ్మెల్యే మదన్ మోహన్ పని తీరు భేష్వరద బాధితులను ఆదుకుంటాంరాష్ట్ర ముఖ్యమంత్రి. రేవంత్ రెడ్డి

by Telangana Express

కామారెడ్డి, సెప్టెంబర్ 4:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ బ్యూరో)వందేళ్లలో ఎప్పుడూ రానంత వరద వచ్చింది
103ఏళ్ళ పోచారం ప్రాజెక్టు వర్ధను తట్టుకొని కాపాడిందని, వరద బాధితులను ఆదుకుంటాం అనల్ని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అన్నారు. గురువారం ఎల్లారెడ్డి సెగ్మెంట్లో బూరిగిద్దా వద్ద రైతులను పరామర్శించి సీఎం. మాట్లాడుతూ…ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ మీకు అండగా నిలిచి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకుండా చూశారన్నారు. కష్టం వచ్చినపుడు అండగా ఉండే వాడే నాయకుడన్నారు.
మీకు అండగా ఉండి ఎమ్మెల్యే ఆపడను అడ్డుకొని, ప్రాణ నష్టం జరక్కుండా చూసారన్నారు.
కష్టాల్లో ఉన్నపుడు ప్రజలకు తోడుగా ఉండాలని నాయకులకు సూచిస్తున్నా అన్నారు.
వరదలకు మైనర్, మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు దెబ్బతిన్నాయన్నారు.
పోచారం ప్రాజెక్టు వరదలకు తట్టుకుని నిలబడి మిమ్మల్ని కాపాడింది,ప్రాజెక్టు వద్ద, వంతెన వద్ద శాశ్వతంగా పనులు జరిపిస్తామన్నారు
తక్షణమే తాత్కాలిక మరమ్మతులు చేశాం అన్ని చెప్పారు.
ప్రత్యక్షంగా మీ కష్టాలను, జరిగిన నష్టాలను చూడటానికే ఇక్కడకు వచ్చాను అన్నారు.
శాశ్వత పరిష్కారం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించాం అన్ని వెల్లడించారు. పంటపొలాల్లో ఇసుక మేటలు తొలగించుకునేందుకు ప్రత్యేకంగా నిధులు మంజూరు చేస్తాం అన్నారు.
పంట నష్టపరిహారం అందిస్తాం అన్ని అన్నారు.
రోడ్లు, ప్రాజెక్టులను మరమ్మతులు చేసేందుకు అధికారులు అంచనాలు రూపొందించాలని ఆదేశించామన్నారు.
అన్ని సమస్యలు పరిష్కరించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని,
క్షేత్రస్థాయిలో పర్యటించి అధికారులు పూర్తిస్థాయిలో వరద నష్టాన్ని అంచనా వేయాలని సూచించామన్నారు.
ముఖ్యమంత్రి వెంట రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ధనసరి అనసూయ (సీతక్క), పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, ఎల్లారెడ్డి శాసనసభ్యులు మదన్ మోహన్ రావు, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, జిల్లా ప్రత్యేక అధికారి రాజీవ్ గాంధీ హనుమంతు, జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్, జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర, ఎల్లారెడ్డి మాజీ మున్సిపల్ ఛైర్మెన్లు కుడుముల సత్యనారాయణ, పద్మ శ్రీకాంత్, కాంగ్రెస్ నేతలు కురుమ సాయిబాబా, నునుగొండ శ్రీనివాస్, విద్యాసాగర్, వినోద్ గౌడ్, ప్రశాంత్ గౌడ్, ఇతర ఉన్నత అధికారులు ఉన్నారు.

You may also like

Leave a Comment