కంప్యూటర్, ప్రింటింగ్ పేపర్ మీషిన్, లామినేషన్ మిషన్ ,మానిటర్ స్వాదినం పరుచుకున్న పోలీసులు _నిందుతుని రిమాండ్ కు తరలించిన పోలీసులు
కోరుట్ల, జులై 24(తెలంగాణ ఎక్స్ ప్రెస్ ) కోరుట్ల కేంద్రంగా నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న అన్ లైన్ సెంటర్ పై పోలీసులు అకస్మిక దాడి చేసి నిందుతుని అరేస్టు చేసి రిమాండ్ తరలించునట్లు కోరుట్ల సి ఐ తెలుపారు. ఈ మేరకు కోరుట్ల సీఐ సురేష్ బాబు వివరాలు వెల్లడించారు.కోరుట్ల పట్టణానికి చెందిన రుద్ర వేణుగోపాల్ పోచమ్మ వాడ లో మంత్ర ఆన్లైన్ సెంటర్ నడిపిస్తూ గత రెండు సంవత్సరాల నుండి ఫోటోషాప్ ద్వారా దొంగ సర్టిఫికెట్లు ఎస్ఎస్సి, ఇంటర్, డిగ్రీ, బీటెక్ మెమోలు, నకిలీ డెత్ సర్టిఫికెట్లు తయారు చేస్తూ అవసరం ఉన్నవారికి వాటిని అమ్ముతూ అక్రమంగా డబ్బులు సంపాదిస్తున్నాడునీ నమ్మదగిన సమాచారం మేరకు బుధవారం రోజున కోరుట్ల పోలీసులు,సిసిఎస్ జగిత్యాల జిల్లా పోలీసు కలిసి నిందితుడి షాప్ మంత్ర ఆన్లైన్ సెంటర్ పైనా ఆకస్మిత దాడి చేసి, నిందితుడు వేణుగోపాల్ నీ పట్టుకొని అతని వద్ద నుండి 106 నకిలీ సర్టిఫికెట్లు ఎస్ఎస్సీ , ఇంటర్, డిగ్రీ, పీజీ,బీటెక్ మెమోలు, నకిలీ డెత్ సర్టిఫికెట్లు ఒక కంప్యూటర్ ఒక ప్రింటర్ పేపర్ కటింగ్ మిషన్ లామినేషన్ మిషన్ ఒక మానిటర్ స్వాధీన పరుచుకుని ,అతని మీద కేసు నమోదుచేసి,నిందితున్ని రిమాండ్ కి తరలించారునీ కోరుట్ల సిఐ తెలిపారు.చక చకగా దొంగ సర్టిఫికెట్ తయారు చేస్తున్న నిందితుడునీ పెట్టుకున్న కోరుట్ల సీఐ , కోరుట్ల ఎస్సై,సిసిఎస్ సిఐ ఎం శ్రీనివాస్,సిసిఎస్ ఎస్సై కె. రాజు , పిసి అఫోరోస్, సాజీద్ , వినోద్, సురేష్, కమలాకర్ లను జిల్లా ఎస్పీ అభినందించారు.
