తెలంగాణ ఎక్స్ ప్రెస్
భైంసా, జూలై 22
భైంసా మండలంలోని ఇలేగాం గ్రామానికి చెందిన ప్రముఖ కవి, రచయిత, మోటివేషన్ స్పీకర్ డాక్టర్ రెడ్ల బాలాజీ తెలుగు సాహిత్యరంగానికి అందిస్తున్న విశేష కృషికి గుర్తింపుగా జాతీయ స్థాయి భారత విభూషణ్ అవార్డు మరియు బంగారు నంది గోల్డ్ మెడల్ లను అందుకున్నారు.
ఈ అవార్డులను శ్రీ ఆర్యాణి సకల కళా వేదిక మరియు శ్రీ గౌతమేశ్వర సాహితీ కళా సేవా సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో కరీంనగర్ ఫిల్మ్ భవన్ వేదికగా ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో ప్రదానం చేశారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ప్రముఖ కవి, రచయిత డాక్టర్ దూడపాక శ్రీధర్ ఇతర జాతీయ స్థాయి కవులు బాలాజీ ని ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు మరియు సాహితీ అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. వారిలో రెడ్ల భువనేశ్వరి, కె.దేవి ప్రియ, వర్ష, అనిల్, వినాయక్, వినాయక్ ప్రసాద్, బాజీరావు,వాడేకార్ లక్ష్మణ్,చక్రధర్, నరేష్, విజయ్ కుమార్‌లు ఉన్నారు.
డాక్టర్ బాలాజీ ఎన్నో కవితలు, సాహిత్య రచనలతో నేటి యువతలో చైతన్యం నింపుతూ, తెలుగు భాష వైభవాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు. ఆయనకు ఈ అరుదైన గుర్తింపులు రావడం గర్వకారణమని సాహిత్యవేత్తలు అభిప్రాయపడ్డారు.
