తెలంగాణ ఎక్స్ ప్రెస్
భైంసా జూలై 22
భైంసా: జాతీయ రహదారుల నిర్మాణానికి నిధులు ఇవ్వాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరిని అప్పట్లో ఎమ్మెల్యే పి రామరావ్ పటేల్ తో పాటు, జిల్లాకు చెందిన బిజెపి ఎమ్మెల్యేలు, ఎంపి ఢిల్లీలో కలిశారు. అయితే నిర్మల్ – భైంసా నాలుగు లైన్లు జాతీయ రహదారి విస్తరణ పనులకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.రాష్ట్రంలో నాలుగు వరుసల జాతీయ రహదారి రోడ్ల నిర్మాణానికి 15 రోడ్లకు 33 వేల 690కోట్ల వ్యయం అవుతుందని ప్రాధమికంగా అధికారులు అంచనా వేశారు.నిర్మల్ -భైంసా వైపు వెళ్లేవారికి ప్రయాణం సులువుగా మారడమే కాకుండా ప్రమాదాల సంఖ్య కూడా తగ్గే ఛాన్స్ పాటు ట్రాఫిక్ సమస్యలు తీరనున్నాయి.ఈ సందర్భంగా ఎమ్మెల్యే పి రామరావ్ పటేల్ కేంద్ర ప్రభుత్వానికి,మంత్రి నితిన్ గడ్కరికి కృతజ్ఞతలు తెలిపారు.
