Home తాజా వార్తలు కమ్మ సంఘం ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ : ఎన్. టి.ఆర్ కు ఘన నివాళి

కమ్మ సంఘం ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ : ఎన్. టి.ఆర్ కు ఘన నివాళి

by Telangana Express

మిర్యాలగూడ జనవరి 18 (తెలంగాణ ఎక్స్ ప్రెస్)

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, తెలుగు ప్రజల అభిమాన నటుడు ఎన్.టీ. రామారావు 29వ వర్ధంతిని పురస్కరించుకొని శనివారం మిర్యాలగూడ కమ్మ సంఘం ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల ఎన్టీఆర్ విగ్రహానికి, మున్సిపల్ కాంప్లెక్స్ వద్ద ఎన్.టి.ఆర్ చిత్రపటానికి పూలమాలలు, పూలతో ఘన నివాళి అర్పించారు. అనంతరం మిర్యాలగూడ మున్సిపల్ కాంప్లెక్స్ కమ్మ సంఘం ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమం పచ్చ వెంకయ్య పోలమ్మ జ్ఞాపకార్థం నిర్వహించారు. సంఘం నాయకులు నల్లమోతు సాంబశివరావు, ఆర్టీసీ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు రామావతారం, లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ చైర్మన్ మాశెట్టి శ్రీనివాస్ (డైమండ్) రైస్ మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు లయన్ కర్నాటి రమేష్, ముక్కపాటి వెంకటేశ్వరరావు, మువ్వా అరుణ్ కుమార్, పచ్చ శ్రీనివాస్, పాతూరి ప్రసాద్ రావు, వెంకటరమణ చౌదరి, పోట్ల వెంకటేశ్వర్లు, కూనల గోపాలకృష్ణ, అనపర్తి గంగాధర్ చిన్నం రమేష్, తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment