Home తాజా వార్తలు *ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతివేడుకలు ఉపాధ్యాయురాలు ను సన్మానం*

*ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతివేడుకలు ఉపాధ్యాయురాలు ను సన్మానం*

by Telangana Express

మిర్యాలగూడ జనవరి 3 (తెలంగాణ ఎక్స్ ప్రెస్) మిర్యాలగూడ పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ లో నేతాజీ హై స్కూల్ లో సావిత్రిబాయి పూలే 194 జయంతి వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జిల్లా మహిళా కార్యదర్శి బంటు కవిత, నేతాజీ హై స్కూల్ కరస్పాండెంట్ శ్రీపతి శ్రీనివాస్ మాట్లాడుతూ బడుగుల జీవితాల్లో వెలుగులు నింపి తమ విలువైన జీవితాలను త్యాగం చేసిన సంఘసంస్కర్త మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు అని అన్నారు. పాఠశాలలో పనిచేసే మహిళా ఉపాధ్యాయులను శాలువాతో సత్కరించి వారి సేవల గురించి తెలియజేశారు. కార్యక్రమంలో విశిష్ట అతిధులుగా బీసీ సంఘం నాయకులు చేగొండి మురళీ యాదవ్,బీసీ యువజన సంగం రాష్ట్ర కార్యదర్శి కే సురేష్ యాదవ్, బీసీ నాయకులు రాజ్ కుమార్, ప్రధానోపాధ్యాయులు బిమ్లా నాయక్, నూరి జబీన్ అలివేలు, సునీత, కళ్యాణి, వసంత ,శోభ , సైదమ్మ సత్యం, విద్యార్థులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment